త్రివిక్రమ్ రాత ఇంకా పూర్తవలే

Update: 2016-07-06 04:15 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా చేయనున్నాడన్న విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే.. ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపైనే చాలా రూమర్లు వచ్చేస్తున్నాయి. దీనిపై ఇప్పుడో క్లారిటీ అయితే వస్తోంది. అసలు విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ ఇంకా తన స్క్రిప్టును కూడా పూర్తి చేయలేదనే విషయం చాలామందికి తెలీకుండానే బోలెడన్ని రాతలు రాసేస్తున్నారు.

పవన్ కోసం త్రివిక్రమ్ దగ్గర ఓ స్టోరీ లైన్ ఉందన్న మాట అయితే నిజమే. దాన్ని ఇప్పటికే పవన్ కి చెప్పడం.. డెవలప్ చేసేందుకు నిర్ణయించడం కూడా జరిగిపోయాయి. ఓ సారి మొదలుపెట్టాక ఆ స్క్రిప్ట్ పూర్తయ్యాక కానీ.. ఈ మాటల మాంత్రికుడు వేరే విషయాలను పట్టించుకోడు. ఎవరు నటిస్తారు.. ఎప్పుడు మొదలవుతుంది.. నిర్మాత ఎవరు లాంటివన్నీ తెలియాలంటే.. ముందు ఫైనల్ స్క్రిప్ట్ చేతిలో ఉండాల్సిందే. అప్పుడు కానీ ఈక్వేషన్స్ మొదలు పెట్టే ఛాన్స్ ఉండదు. ఈ విషయం తెలీక చాలామంది ఫలానా ప్రొడ్యూసర్ చేస్తున్నాడు.. ఫలానా ముహూర్తానికి మొదలవుతుంది అంటూ రూమర్స్ పుట్టించేస్తున్నారు.

డైలాగ్ వెర్షన్ కూడా పూర్తిగా చేతిలో పడ్డాక అప్పుడు సినిమాకి సంబంధించిన సమీకరణాలు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడే వీటి గురించి మాట్లాడ్డం అంటే అది చాలా తొందరపాటు అని కూడా సూచించేస్తున్నారు. ఏతావాతా అర్ధమయ్యేదేంటంటే.. పవన్- త్రివిక్రమ్ సినిమా రావడం అయితే ఖాయమే. కానీ దాని ముహూర్తం ఎప్పుడనే విషయం తేలడానికి ఇంకా కాస్త టైమ్ ఉంది.
Tags:    

Similar News