త్రిష వాళ్లను తిట్టి పోసింది!!

Update: 2016-11-24 19:30 GMT
మనుషుల్లో మానవత్వం.. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. "బ్లాక్ లో కొందామన్న మంచోళ్లు దొరకట్లా" అంటూ పూరీ జగన్నాధ్ చెప్పిన డైలాగ్ నిజమే అనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం చెన్నైలో కొందరు విద్యార్ధులు బిల్డింగ్ పై నుంచి కుక్కను విసిరేసిన సంఘటన చూశాం. ఇప్పుడు చెన్నైలో అంతకు మించిన సంఘటన ఒకటి జరిగింది.

వెల్లూరులోని క్రిస్టియన్ వెల్లూరు కాలేజ్ విద్యార్ధులు ఓ కోతిని అరాచకంగా హింసించారు. దాని మరణానికి కారణం అయ్యారు. పోలీసులు ఈ సంఘటనకు బాధ్యులైన వారి కోసం వెతుకుతుంటే.. చెన్నై బ్యూటీ త్రిషను ఈ ఘటన కదిలించేసింది. "మనసు విరిగిపోయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. వెల్లూరు క్రిస్టియన్ కాలేజ్ విద్యార్దులు కోతి మరణానికి కారణం అయ్యారని తెలిసి చాలా బాధపడ్డాను. భవిష్యత్తు డాక్టర్లుగా మారాల్సిన మీరు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు ? మీ క్రిస్టియన్ విలువలు ఏమయ్యాయి? మిమ్మల్ని పెంచినోళ్లు ఎవరు?" అంటూ ఘాటుగానే వాయించేంసింది త్రిష.

రాయడం కోసం ట్విట్టర్ లో త్రిష వాడిన పదజాలాన్ని కాస్త సరళంగా మార్చాల్సి వచ్చింది కానీ.. ట్వీట్ లో మాత్రం త్రిష ఘాటుగా ఏకి పారేసింది. త్రిష తిట్టిందనో.. ఇంకోళ్లు అన్నారనో మాట పక్కన పెట్టి చూస్తే.. అసలు ఓ మూగ జంతువును ఇంత దారుణంగా ఎలా హింసించగలగుతున్నారు అనే మాట మాత్రం ఆలోచించాల్సిన విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News