పాటేసుకుంటున్న రాజు గారు

ప్ర‌స్తుతం న‌వీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా ఓ మూవీ రాబోతుంది.;

Update: 2025-12-08 10:04 GMT

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌, జాతి ర‌త్నాలు, మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పోలిశెట్టి. ఈ హీరో నుంచి సినిమా వ‌స్తుందంటే ఏదో మంచి కంటెంటే ఉంటుంద‌నే న‌మ్మకాన్ని ఆడియ‌న్స్ కు క‌లిగించిన నవీన్, మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి త‌ర్వాత స్క్రిప్ట్స్ సెల‌క్ష‌న్ లో కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

2026 సంక్రాంతికి అన‌గ‌న‌గా ఒక రాజు

ప్ర‌స్తుతం న‌వీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా ఓ మూవీ రాబోతుంది. అన‌గ‌న‌గా ఒక రాజు అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మారి అనే కొత్త డైరెక్ట‌ర్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానుండ‌గా, సితార ఎంట‌ర్టైన్మెంట్స్ ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

యాక్సిడెంట్ వ‌ల్ల ఆల‌స్య‌మైన రిలీజ్

ఆల్రెడీ రిలీజైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈసారి పండ‌గ‌కి థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయ‌డం ఖాయ‌ని చిత్ర యూనిట్ చాలా ధీమా వ్య‌క్తం చేస్తోంది. వాస్త‌వానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ మ‌ధ్య‌లో న‌వీన్ కు యాక్సిడెంట్ అవ‌డంతో సినిమా షూటింగ్ లేట‌వ‌డంతో మూవీ వాయిదా ప‌డి పండ‌క్కి షెడ్యూలైంది.

ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్ తో జ‌రుగుతుంద‌ని, మేక‌ర్స్ ప్ర‌స్తుతం ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నార‌ని, ఇది కాకుండా మ‌రో సాంగ్ షూట్ పెండింగ్ ఉంద‌ని, ఆ సాంగ్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News