మార్చిపై కన్నేసిన పవర్ స్టార్.. మరి వాళ్ల పరిస్థితేంటి?
ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి ఎదురయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకి ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు షెడ్యూలై ఉండగా, ఇప్పుడు మరో పెద్ద సినిమా అదే నెలపై కన్నేసినట్టు తెలుస్తోంది.;
ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్లు అనేవి చాలా పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముందు ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, తర్వాత షూటింగ్ పూర్తవకపోవడం వల్లనో, లేక మరేదైనా సమస్య వల్లనో సినిమా వాయిదా పడటం చాలా సహజంగా జరుగుతూ వస్తుంది. ఒక సినిమా వాయిదా ప్రభావం మరెన్నో సినిమాలపై పడుతుందనేది తెలిసిన విషయమే.
ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి ఎదురయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకి ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు షెడ్యూలై ఉండగా, ఇప్పుడు మరో పెద్ద సినిమా అదే నెలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
మార్చిలో రెండు పెద్ద సినిమాలు
ఆల్రెడీ ఈ ఇయర్ హరి హర వీరమల్లు, ఓజి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన పవర్ స్టార్, మార్చిలో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే మార్చిలో నాని ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలు డేట్స్ ను అనౌన్స్ చేశారు. ది ప్యారడైజ్ మార్చి 26న రిలీజ్ కానుండగా, పెద్ది మార్చి 27న రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో అఫీషియల్ గా చెప్పారు.
ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తలు నిజమై పవర్ స్టార్ కానీ రేసులోకి దిగితే ఈ రెండు సినిమాలూ వెనక్కి తగ్గే పరిస్థితులే ఎక్కువ. పైగా ది ప్యారడైజ్ షూటింగ్ ఇంకా చాలా భాగం పూర్తవాల్సి ఉంది పైగా పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా టైమ్ పట్టేలా ఉండటంతో సినిమా వాయిదా పడుతుందంటున్నారు. ఇక చరణ్ విషయానికొస్తే తన బాబాయి సినిమా వస్తుందంటే తన సినిమాను రిలీజ్ చేసే సాహసం చేయడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకొస్తారో? ఎవరు వెనుకడుగేస్తారో చూడాలి.