ట్రైలర్ టాక్: ఆకట్టుకునేలా సత్యదేవ్ 'గువ్వ గోరింక'

Update: 2020-12-12 10:18 GMT
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ - ప్రియాలాల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ''గువ్వ గోరింక''. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆకార్ మూవీస్ బ్యానర్ పై జీవన్ రెడ్డి - దాము సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా "గువ్వ గోరింక' ట్రైలర్ ని శనివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ లో ''ఈమె పేరు శిరీష.. సంగీతమే ఈమె ప్రపంచం.. ఇతని పేరు సదానంద్.. చదువుతోంది మెకానికల్ ఇంజినీరింగ్ లో పీ హెచ్ డి.. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినవాడిలా రియాక్ట్ అవుతాడు.. సంగీతమే ప్రాణమైన ఓ అమ్మాయికి, సౌండ్ అంటేనే పడని ఓ అబ్బాయికి.. ఇష్టాయిష్టాలు వేరున్నా.. గువ్వ గోరింకల్లాంటి ఇద్దరి కథ'' అంటూ ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు.ట్రైలర్ చూస్తుంటే సత్యదేవ్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని అర్థం అవుతోంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన ఆర్ ఆర్ బాగుంది. ఇందులో ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మానవ సంబంధాలను యువత ఎలా చూస్తున్నారన్న అంశాలతో తెరకెక్కిన 'గువ్వ గోరింక' ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది.


Full View
Tags:    

Similar News