'గాయపడ్డ సింహం' ట్రైలర్.. ఫ్రెష్ కామెడీతో హైప్ పెంచిందిగా!
టాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ గాయపడ్డ సింహం మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.;
టాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ గాయపడ్డ సింహం మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో తరుణ్ భాస్కర్ ఫన్నీ రోల్ లో కనిపించనున్నారు. హీరోయిన్స్ గా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి నటిస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి, భాను కిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ కుమార్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. తాజాగా ట్రైలర్ తో మరింత హైప్ పెరిగింది. ఆ ట్రైలర్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేయడం విశేషం. ట్రైలర్ మొదటి నుంచే ఎంటర్టైన్మెంట్ టోన్ లో సాగుతూ, కొత్త తరహా కామెడీని ప్రామిస్ చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ... అందరినీ ఆకట్టుకుంటోంది.
కథ విషయానికి వస్తే.. అమెరికాలో సెటిల్ కావాలన్న కలలతో ఉన్న ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. తన కూతురిని ఎన్‌ఆర్‌ఐకి ఇచ్చి పెళ్లి చేయాలనే తండ్రి ఒత్తిడితో హీరో పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అయితే అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కఠిన వలస నిబంధనలు అతని కలలకు అడ్డంకిగా మారతాయి. దీంతో హీరో తీసుకునే విచిత్రమైన నిర్ణయం.. ట్రంప్ పై రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన.. కామెడీకి కారణమవుతుంది.
ఇక కథలో కీలక మలుపుగా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పాత్ర ఉంటుంది. ఆయన రోల్ కథను మలుపు తిప్పుతుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. మరోవైపు యంగ్ హీరో శ్రీ విష్ణు గెస్ట్ అప్పీరెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశభక్తి భావాలు కలిగిన ఫన్నీ రోల్ లో ఆయన కనిపించడం ట్రైలర్ కు హైలైట్ గా మారింది. ట్రైలర్ లోని పలు సన్నివేశాలు ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వెంకీ సినిమా సన్నివేశాల ప్యారడీ, అలాగే కేజీఎఫ్ స్టైల్ స్పూఫ్ వంటి అంశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి.
ఫ్రెష్ కామెడీ ట్రీట్మెంట్ తో పాటు డైలాగ్స్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెక్నికల్ గా కూడా సినిమా మంచి రేంజ్ లో ఉందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ప్రొడక్షన్ విలువలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు కొత్త ఫీల్ తీసుకొస్తున్నాయి. మొత్తానికి గాయపడ్డ సింహం ట్రైలర్ కామెడీతోపాటు ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఉంటూ.. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచుతోంది. మే 1న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియెన్స్ కు ఆ సినిమా మంచి ట్రీట్ గా నిలుస్తుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.