'స్పిరిట్' కి పెద్ద చిక్కు వచ్చి పడిందే..!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.;
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ప్రభాస్ వరుస బిజీ షెడ్యూల్స్ కారణంగా స్పిరిట్ సినిమాకు బల్క్ డేట్లు ఇవ్వలేక పోతున్నాడట. మే నెలలో లేదా జూన్ నెలలో స్పిరిట్ కోసం డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ 50 రోజులు కంటిన్యూగా డేట్లు ఇస్తే స్పిరిట్ సినిమాను పూర్తి చేసేందుకు గాను సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభాస్ మాత్రం అన్ని సినిమాలకు మాదిరిగానే స్పిరిట్ సినిమాకు కూడా అదుగో ఇదుగో అన్నట్లుగా డేట్లు సర్ధుబాటు చేయకుండా ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. దాంతో ఈ ఏడాదిలో విడుదల కావాల్సిన స్పిరిట్ సినిమాను 2027 కు వాయిదా వేయడం జరిగిందని సమాచారం అందుతోంది.
ప్రభాస్ స్పిరిట్ సినిమా రిలీజ్...
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమాను 2027 మార్చి నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. రంజాన్ సందర్భంగా విడుదల అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. స్పిరిట్ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అంతా బలంగా నమ్ముతున్నారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా కనుక సహజంగానే బాలీవుడ్‌లో అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను 2027 మార్చిలో ఈద్ సందర్భంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అదే ఈద్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. సల్మాన్ కి ఈద్ ఒక సెంటిమెంట్‌గా వస్తుంది. కనుక 2027 ఈద్ కి సల్లూ భాయ్ రాక ఖాయం.
సల్మాన్ ఖాన్ హీరోగా...
సల్మాన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫెయిల్యూర్స్ ను చవిచూస్తున్నాడు. అయినా కూడా సల్మాన్ ఖాన్ సినిమా ఈద్ కి వస్తుంది అంటే ఖచ్చితంగా అభిమానులతో పాటు హిందీ ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. దాంతో పోటీగా ఉన్న సినిమాలు సైడ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ హీరోల సినిమాలు సల్మాన్ ఖాన్ ఈద్ కి వస్తున్నాడు అంటే సైడ్ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమాను ఇప్పటికే ఈద్ కి అనుకున్నారు. కనుక పెద్ద చిక్చు వచ్చి పడిందే అంటూ నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. వంశీ పైడిపల్లి మూవీ అంటే కచ్చితంగా ఆలస్యం అయ్యే అవకాశం లేదు. ఆయన అనుకున్న సమయంకు సినిమాను పూర్తి చేసి విడుదలకు ఇస్తాడు. ఇంకా చాలా సమయం ఉంది కనుక సల్మాన్ ఈద్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ తో ప్రభాస్ పోటీ...
ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఈద్ కి రావాలని బలంగా అనుకుంటున్నప్పటికీ విడుదల వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. దర్శకుడు సందీప్ వంగ ఎంత ప్రయత్నించినా కూడా షూటింగ్‌కు ప్రభాస్ డేట్లు ఇవ్వక పోతే ఆయన ఏం చేయలేడు. కనుక ప్రభాస్ నుంచి స్పిరిట్ సినిమాకు కావాల్సిన రోజులు, కావల్సినప్పుడు డేట్లు ఇస్తే 2027 ఈద్ కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఎంత వరకు ఉంది అంటే ప్రశ్నార్థకమే. అందుకే సల్మాన్ ఖాన్ సినిమా ఈద్‌కి వచ్చి, ఆ తర్వాత స్పిరిట్ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాదని దర్శకుడు సందీప్ వంగ షూటింగ్ పూర్తి చేసి ఈద్ కి విడుదల చేస్తే మాత్రం బిగ్ ఫైట్ తప్పదు. సౌత్ ఇండియాలో ప్రభాస్ దుమ్ము దులిపితే, నార్త్ ఇండియాలో సల్మాన్ ఖాన్ వసూళ్లు భారీగా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే చివరకు హిట్ బొమ్మకే లాంగ్ రన్ లో జనాలు పట్టం కడుతారు.