ఒకవేళ సందీప్ వంగా 'మైఖేల్ జాక్సన్ బయోపిక్' తీసి ఉంటే?
అందుకే ఇప్పుడు ఎమోషన్స్ ని పీక్స్ లో ఎలివేట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేతికి ఇలాంటి స్క్రిప్టు దొరికితే ఏమవుతుంది? అన్న చర్చ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.;
పాప్ చక్రవర్తి మైఖేల్ జాక్సన్ బయోపిక్ సందీప్ వంగా తీసి ఉంటే ఎలా ఉండేది..? అర్జున్ రెడ్డి - కబీర్ సింగ్ కి పదింతలు రా అండ్ రస్టిక్ కంటెంట్ తో కమర్షియల్ గా పీక్స్ కి చేరుకునేది.. బహుశా ప్రపంచంలో అవతార్ రికార్డులు బద్ధలు కొట్టేవాడేమో!
ప్రపంచంలోనే ఇన్ని ఎమోషన్స్ ఉన్న లైఫ్ ఇంకొకరికి లేదు. ఎన్నో కష్టాలు కన్నీళ్లు అవమానాలు ఈతి బాధలు.. సర్జరీలు.. నపుంసకుడు ట్యాగ్.. బాలురపైనే లైంగిక వేధింపులు.. ఒకటేమిటి ఇలాంటి ఎన్నిటినో అనుభవించిన కళాకారుడు జాక్సన్.. అర్జున్ రెడ్డిని మించిన ఎమోషన్స్ జాక్సన్ జీవితంలో ఉన్నాయి. ఉడ్తా పంజాబ్ ని మించిన కఠిన నిజాలు అతడిలో ఇమిడి ఉన్నాయి. అయితే అలాంటి జీవితాన్ని వెండితెరపై చప్పగా చూపిస్తే, ఇదిగో ఇలా `మైఖేల్` సినిమాలా ఉంటుందని చాలా మంది నిరాశ చెందారు.
అందుకే ఇప్పుడు ఎమోషన్స్ ని పీక్స్ లో ఎలివేట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేతికి ఇలాంటి స్క్రిప్టు దొరికితే ఏమవుతుంది? అన్న చర్చ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒక జరిగిన కథకు ఊహను జోడించి అద్భుతాలు చేయడంలో వంగా తర్వాతే..
పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన `మైఖేల్`చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. జాక్సన్ జీవితంలోని అసలైన ఘర్షణను.. లోతైన భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం అతడి సంగీత ప్రయాణంపైనే సినిమా దృష్టి సారించిందని.. కంటెంట్ కొంత `చప్పగా` ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ చిత్రాన్ని టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించి ఉంటే ఫలితం ఎలా ఉండేదనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.
నిజానికి సందీప్ రెడ్డి వంగాకు మైఖేల్ జాక్సన్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జాక్సన్ జీవితంపై సినిమా తీయాలనే కోరికను వెలిబుచ్చారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో మనుషుల అంతర్లీన భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ గా చూపించే వంగా.. జాక్సన్ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు.. ఎదుర్కొన్న వివాదాలను వెండితెరపై ఆవిష్కరించి ఉంటే అది ఖచ్చితంగా ఒక గ్లోబల్ మాస్టర్ పీస్ అయ్యేదని అభిమానులు భావిస్తున్నారు. బహుశా వంగా చేతిలో ఈ కథ పడి ఉంటే `అవతార్`ని టచ్ చేసేవాడేమో!నని అతడి అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సందీప్ వంగా కోణంలో విశ్లేషిస్తే... మైఖేల్ జాక్సన్ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని సబ్-ప్లాట్లు ఉన్నాయి. చిన్నతనంలో స్కూల్ పాటల దగ్గర నుంచి.. చర్మం రంగు మార్చుకోవడం వరకు అతడు సాగించిన ప్రయాణం ఒక గొప్ప గాథ. అయితే తాను జాక్సన్ సినిమా తీయాలని అనుకున్నప్పుడు ప్రధాన సమస్య `కాస్టింగ్` అని అప్పట్లోనే చెప్పారు. మైఖేల్ జాక్సన్ బాడీ లాంగ్వేజ్.. ఆయన స్వరం .. స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబించే నటుడిని వెతకడం ఏ దర్శకుడికైనా సవాలే. ఇప్పుడు ఆంటోనీ ఫుక్వా.. జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్‌ను ఎంచుకుని ఆ సమస్యను అధిగమించినా కథనంలో మాత్రం ఆశించిన ఇంటెన్సిటీ లోపించిందనేది వాస్తవం.
మైఖేల్ జాక్సన్ జీవితంలోని వివాదాస్పద కోణాలను ఆవిష్కరించడం కూడా ఒక క్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుత `మైఖేల్` చిత్రం వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం ఆయన లెగసీని మాత్రమే చూపించింది. కానీ సందీప్ వంగా తన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా.. ఒక వ్యక్తి జీవితాన్ని నిజాయితీగా చూపించాలంటే నైతికంగా, సృజనాత్మకంగా ఎంతో ధైర్యం కావాలి. అర్జున్ రెడ్డిలో కనిపించే ఎమోషన్స్ కంటే పదింతలు ఎక్కువ ఎమోషన్స్ జాక్సన్ జీవితంలో ఉన్నాయని..వాటిని వంగా శైలిలో చూపిస్తే అది `ఉడ్తా పంజాబ్` కంటే కఠినమైన వాస్తవాలతో కూడి ఉండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా `మైఖేల్` సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తున్న తరుణంలో సందీప్ వంగా పాత ఇంటర్వ్యూ మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఒక జరిగిన కథకు ఊహను జోడించి అద్భుతాలు చేయడంలో దిట్ట అయిన వంగా.. భవిష్యత్తులోనైనా జాక్సన్ వంటి అంతర్జాతీయ ఐకాన్ కథను తనదైన శైలిలో టచ్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికి మైఖేల్ చిత్రం థియేటర్లలో ఆడుతున్నా.. సగటు సినీ ప్రేమికుడు మాత్రం ``వంగా తీసి ఉంటేనా.. ఆ కిక్కే వేరుగా ఉండేది!`` అని చర్చించుకుంటున్నారు.