ఈ పరిస్థితుల్లో రవితేజ 'క్రాక్' ని రిలీజ్ చేస్తే కష్టాలు తప్పవా...?
మాస్ మహారాజా రవితేజ - శృతి హాసన్ జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''క్రాక్''. రవితేజతో ఇంతకముందు 'డాన్ శీను' 'బలుపు' చిత్రాలను తెరకెక్కించిన మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. సినిమా హాళ్లు త్వరలో ఓపెన్ చేస్తుండటంతో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే 'క్రాక్' సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంది చూడటానికి వస్తారు అనేది ప్రశ్నార్థంగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు రవితేజకి ఉన్న మాస్ ఇమేజ్ ఇప్పుడు కూడా ఉంటే ఈ సినిమాను నిర్మాతలు కళ్లు మూసుకుని విడుదల చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. 'టచ్ చేసి చూడు' 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కో రాజా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో 'క్రాక్' నిర్మాతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిస్థితులు చక్కబడిన తరువాతే సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన బిజినెస్ లాక్ డౌన్ కి ముందే మొదలుపెట్టి.. చాలా మంది డిస్టిబ్యూటర్స్ వద్ద అడ్వాన్సులు కూడా తీసుకున్నారట. ఇప్పుడు వారంతా ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబడుతుండటంతో.. ఈ సినిమాని వీలైనంత త్వరగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని ఫిలిం సర్కిల్స్ టాక్ నడుస్తోంది. మరి 'క్రాక్' విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి.