మృణాల్ తెలుగు హీరోనే పెళ్లి చేసుకోవాలా? అల్లు బాస్ క్రేజీ కామెంట్స్
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.;
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్.. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
రీసెంట్ గా డెకాయిట్ సినిమాతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమంలో స్టేజ్ కింద కూర్చున్న మృణాల్ ఠాకూర్ ను చూసిన అల్లు అరవింద్ మైక్ తీసుకుని సరదాగా మాట్లాడారు. ఆమె నటన, అందం గురించి ప్రశంసలు కురిపించిన ఆయన.. చివర్లో చేసిన ఒక వ్యాఖ్య అందరినీ నవ్వుల్లో ముంచేసింది.
'మృణాల్.. నువ్వు అద్భుతంగా నటిస్తున్నావు. నీ గ్లామర్, యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. నువ్వు మాకు చాలా అవసరం. అందుకే ఒక చిన్న సలహా ఇస్తున్నా.. నువ్వు ఎలాగైనా ఒక తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు నువ్వు ఇక్కడే సెటిల్ అయి, మా టాలీవుడ్ హీరోయిన్ గా శాశ్వతంగా ఉండిపోవచ్చు' అంటూ నవ్వుతూ అన్నారు.
అల్లు అరవింద్ మాటలు విన్న మృణాల్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి. ఆయన వ్యాఖ్యలకు సిగ్గుపడుతూ ఫుల్ గా నవ్వేశారు. స్టేజ్ పై ఉన్న ఇతర సెలబ్రిటీలు కూడా అరవింద్ టైమింగ్ కు ఫిదా అయి నవ్వుల్లో మునిగిపోయారు. అయితే సందర్భంగా అల్లు అరవింద్.. గతంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠికి చెప్పిన మాటలను కూడా గుర్తు చేశారు.
అప్పట్లో ఆమెకు ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చానని, తర్వాత లావణ్య వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని టాలీవుడ్ లోనే స్థిరపడిందని చెప్పారు. దీంతో సభలో ఉన్నవారు మరింతగా నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అరవింద్ గారు చెప్పింది నిజమే, మృణాల్ తెలుగు కోడలు కావాలని కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనా అల్లు అరవింద్ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇది కేవలం ఒక ఫన్ మూమెంట్ గా మిగిలిపోతుందా? లేక నిజంగానే మృణాల్ ఠాకూర్ భవిష్యత్తులో తెలుగు కుటుంబంలోకి అడుగు పెడుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా కొనసాగుతున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. భవిష్యత్తులో ఆమె నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.