డెకాయిట్.. రెమ్యూనరేషన్ పై మృణాల్ ఊహించని కామెంట్.. గెస్ చేయలేదు కదా!

"తక్కువ రెమ్యూనరేషన్‌తో రెండు సినిమాలు (తెలుగు, హిందీ) చేసిన ఫీలింగ్ కలిగింది" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. దర్శకుడు షానియల్ పనితీరుపై కూడా ఆమె ప్రశంసల వర్షం కురిపించింది.;

Update: 2026-04-12 15:30 GMT

మృణాల్ ఠాకూర్ అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక క్రేజీ పేరు. 'సీతారామం' నుంచి 'ఫ్యామిలీ స్టార్' వరకు ఆమె చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను సొంత ఇంటి అమ్మాయిలా మార్చేశాయి. అయితే, తాజాగా అడివి శేష్‌తో కలిసి నటించిన 'డెకాయిట్' సినిమా కోసం మృణాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ఆమె చేసిన త్యాగం విని అంతా షాక్ అవుతున్నారు. ఆ అసలు విషయం ఏంటో మీరే చూడండి..

కథ కోసం తగ్గించుకున్న పారితోషికం:

సాధారణంగా ఒక హిట్ పడితే చాలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచేస్తారు. కానీ మృణాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. 'డెకాయిట్' సినిమా కథ వినగానే ఆమెకు బాగా నచ్చేసిందట. అయితే మేకర్స్ బడ్జెట్ పరిమితులు ఉండటంతో, తన మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ పారితోషికానికే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 149 రోజుల కాల్ షీట్స్ ఇచ్చి మేకర్స్‌కు పూర్తి సహకారం అందించింది. కేవలం డబ్బు కోసం కాకుండా, మంచి పాత్ర కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

రిస్కీ స్టంట్స్.. అంబులెన్స్ డ్రైవింగ్:

ఈ సినిమాలో మృణాల్ 'సరస్వతి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. ఈ పాత్ర కోసం ఆమె కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా రిస్కీ స్టంట్స్ కూడా చేసింది. ముఖ్యంగా అంబులెన్స్‌ను హై స్పీడ్‌లో డ్రైవ్ చేసే సీన్స్ ఆమెకు పెద్ద సవాల్‌గా నిలిచాయట. ఇక ఆ వాహనానికి హ్యాండ్ బ్రేక్ లేకపోయినా, ప్రాణాలకు తెగించి మరి ఆ సీన్స్ లో నటించింది. ఛేజింగ్ సీన్స్, డ్రైవింగ్ సన్నివేశాల్లో మృణాల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో అర్థమవుతుంది. అందుకే ఈ పాత్ర తనకో కొత్త పాఠం నేర్పిందని ఆమె చెబుతోంది.

బురదకు బదులు చాక్లెట్.. మేకర్స్ కేరింగ్:

షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ మృణాల్‌ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారట. ఒక సీన్‌లో ఆమె బురదలో పడి నటించాల్సి ఉండగా, మేకర్స్ ఆమె ఫేస్ పాడవకూడదని బురదకు బదులుగా చాక్లెట్‌ను ఉపయోగించారట. ఇక ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా యూనిట్ చూపించిన కేరింగ్ తనకు ఎంతో నచ్చిందని మృణాల్ మురిసిపోయింది. "తక్కువ రెమ్యూనరేషన్‌తో రెండు సినిమాలు (తెలుగు, హిందీ) చేసిన ఫీలింగ్ కలిగింది" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. దర్శకుడు షానియల్ పనితీరుపై కూడా ఆమె ప్రశంసల వర్షం కురిపించింది.

సక్సెస్ బాటలో డెకాయిట్:

ఈ నెల 10న విడుదలైన 'డెకాయిట్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అడివి శేష్ 'హరి' పాత్రలో, మృణాల్ 'సరస్వతి' పాత్రలో పోటీపడి నటించారు. అసలు వీరిద్దరూ డెకాయిట్స్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో సాగే ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మంచి సినిమా చేయాలనే తపనతో రెమ్యూనరేషన్ పక్కన పెట్టి మృణాల్ చేసిన ఈ ప్రయోగం ఫలించింది. ఇక తెలుగు ప్రేక్షకులు తనను 'తెలుగు అమ్మాయి'గా స్వీకరించడం తనకెంతో గర్వంగా ఉందని చెబుతూ మృణాల్ తన ఆనందాన్ని పంచుకుంది.

Tags:    

Similar News