'డెకాయిట్'లో శేష్ యాక్టింగ్.. మృణాల్ ఎంత బాగా చెప్పిందో!

టాలీవుడ్ నటుడు అడివి శేష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.;

Update: 2026-04-12 18:16 GMT

టాలీవుడ్ నటుడు అడివి శేష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు రేపింది.

విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్‌ ను పురస్కరించుకుని మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్‌ లో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఆ సందర్భంగా మృణాల్ ఠాకూర్ తన లుక్‌ తో ఆకట్టుకోవడమే కాకుండా, హీరో అడివి శేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

"అడివి శేష్‌ ను కేవలం థ్రిల్లర్ సినిమాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. రొమాన్స్, హ్యూమన్ డ్రామా వంటి విభిన్న జానర్లలో కూడా ఆయన ప్రతిభను చూపించగలరు. ఈ సినిమాలో ఆయన కెరీర్‌ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఆయనతో పాటు ఏడ్చారు, కోపం పడ్డారు. ఇదొక నిజమైన పైసా వసూల్ సినిమా" అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

అలాగే ఆ చిత్రంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఇచ్చినందుకు మొత్తం టీంకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో చిత్రంలో హరిదాస్ పాత్రలో అడివి శేష్ మాస్ లుక్‌ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా మదనపల్లి యాసలో చెప్పిన డెలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరోవైపు, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ తన నటనతో ఆకట్టుకున్నారు. అనేక సన్నివేశాల్లో కళ్ళతోనే భావాలు వ్యక్తపరచడం ఆమె పాత్రకు మరింత బలం చేకూర్చింది. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌ పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌ గ్రాండ్ గా నిర్మించారు.

కథ, స్క్రీన్‌ ప్లేను అడివి శేష్ స్వయంగా దర్శకుడితో కలిసి రూపొందించగా, డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించారు. సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్ అందించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలు కోదాటి పవన్ కళ్యాణ్ నిర్వహించారు. నటీనటుల పరంగా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత స్ట్రెంత్ యాడ్ చేశారు. మొత్తానికి డెకాయిట్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సమ్మర్ సీజన్‌ లో హిట్‌ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News