ఈవెంట్ ఆర్గనైజేషన్ పై అగ్ర నిర్మాణ సంస్థ‌లు గుర్రుగా ఉన్నాయట...?

Update: 2020-07-11 07:30 GMT
సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పుకొనే ఓ ఈవెంట్ ఆర్గనైజేషన్ పై ఇండస్ట్రీలోని కొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇప్పుడు గుర్రుగా ఉన్నాయట. వివ‌రాల్లోకి వెళితే టాలీవుడ్ లో పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ సదరు ఈవెంట్ మేనేజ్మెంట్ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ వారి వద్దకే వెళ్లే స్థాయికి చేరుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈవెంట్ మేనేజ్మెంట్ అధినేత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని హ‌ర్ట్ చేసిన‌ట్లుగా చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ లోకి ఈవెంట్స్ ట్రెండ్ తానే తీసుకువ‌చ్చానని ఆయన మాట్లాడాడని ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది అగ్ర నిర్మాతలు త‌మ సొంత టీమ్ ల‌ను పెట్టుకొని వారి మేనేజ్మెంట్ టీమ్ తో క‌లిసి ప‌నిచేస్తే క‌నీసం క్రెడిట్ కూడా ఇవ్వకపోగా.. తానే అన్ని చేసానని చెప్పుకోవ‌డంపై కాస్త కోపంగానే ఉన్నార‌ట‌.

అంతేకాకుండా ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తో క‌లిసి ఇండస్ట్రీలోకి కొత్త పద్ధ‌తి తీసుకొచ్చి సినిమాలు రిలీజ్ చేస్తుండటం కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కి మింగుడు ప‌డ‌టం లేద‌ట. ఇక ఇప్పటి నుంచి అస‌లు ఈవెంట్స్ అనేవి సదరు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వ‌కుండా ఉంటేనే మంచిద‌నే అభిప్రాయంతో కొంతమంది నిర్మాతలు ఉన్నారట. ప్రొడ్యూసర్స్ తో పాటు డిస్ట్రీబ్యూట‌ర్లు ఎగ్జీబిట‌ర్లు కూడా ఈవెంట్ ఆర్గనైజేషన్ పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాకుండా చేసేలా వారి ఆలోచనలు ఉన్నాయని... దీని వలన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారట. మాములు టైమ్ లో అయితే ఇలాంటి ఐడియాలు ఇంప్లిమెంట్ చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు కానీ.. అస‌లే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ప్ర‌భావం ఎక్కువ అవుతున్న ఈ టైమ్ లో కొత్త ఐడియాలని తీసుకురావడం కరెక్ట్ కాదని డిస్ట్రీబ్యూట‌ర్లు అభిప్రాయపడుతున్నారట.

ముఖ్యంగా ఇండ‌స్ట్రీ మీద బ్ర‌తికే ఈవెంట్ మేనేజ్మెంట్ వారు థియేటర్స్ కి నష్టం కలిగించేలా ఇలాంటి విధానంతో ముందుకు రావ‌డం స‌రికాద‌న్న‌ది డిస్ట్రీబ్యూట‌ర్ల వాద‌న‌. దీనికి తోడు సదరు ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు ఆ స్టార్ డైరెక్టర్ తీసే ప్రతి సినిమా వీరు తీసుకొచ్చిన కొత్త పద్ధతిలోనే రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ క్రమంలో ఆ స్టార్ డైరెక్టర్ వివాదాస్పద టైటిల్ తో ఇటీవల అనౌన్స్ చేసిన సినిమా కూడా వారి ఆధ్వర్యంలోనే విడుదల కానుంది. దీంతో ఒక వర్గం సినీ అభిమానుల ఆగ్రహానికి సదరు ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ గుర‌వ్వ‌డం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News