ప్రముఖుల జీవిత కథల్లో నటించాలంటే అదృష్టం ఉండాలి. అయితే బయోపిక్ కథలు అంటేనే మన భామలు ఎందుకనో భయపడుతున్నారు. ఆఫర్లు వచ్చినా అసలు వద్దే వద్దు అనేస్తున్నారట. ఈ జాబితాలో సౌత్ నాయికలు ఎవరెవరు? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి.
బాబోయ్ బయోపిక్ కథలు వద్దు అంటున్న సౌత్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో సమంత- శృతి హాసన్ - కాజల్ - తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ భామలంతా ఇటీవల ఉమెన్ ఓరియెంటెడ్ కథలకే ఓకే చెబుతున్నారు. బయోపిక్స్ లో నటించడానికి ఇష్ట పడటం లేదు. ఈ సౌత్ బ్యూటీలకు బాలీవుడ్ లో బయోపిక్ ఆఫర్లు వస్తున్నా ససేమిరా అనేస్తున్నారట. ఆ మేరకు ముంబై మీడియా లో ఆసక్తికర ముచ్చట సాగుతోంది.
సామ్ ఇటీవల యూటర్న్- ఓ బేబి లాంటి లేడీ ఓరియెంటెడ్ కి ప్రాధాన్యతనిచ్చారు. మజిలీ లోనూ తన పాత్ర కు పరిధి ఎక్కువే. కాజల్ చాలా కాలంగా స్టార్ హీరోల ఆఫర్లు కాదనుకుని.. `క్వీన్` రీమేక్ లో నటించడానికి కారణం తెలిసినదే. తమన్నా లేడీ ఓరియెంటెడ్ చేస్తూనే అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్ని విడిచిపెట్టడం లేదు. ఆఫర్ వస్తే కాదనడం లేదు. శ్రుతిహాసన్ కి హిందీలో బయోపిక్ కథల్ని ఆఫర్ చేస్తే కాదనేసిందట. వీళ్లంతా జీవితకథల్లో నటించేందుకు ఆసక్తి కనబరచడం లేదు! అంటూ ముంబై వర్గాల్లో గుసగుసలు వేడెక్కిస్తున్నాయట. పలువురు దర్శకులు వినిపించిన బయోపిక్ కథల్ని సున్నితంగా తిరస్కరించారట. అయితే ఈ భామల ఆలోచనల కు భిన్నం గా కంగన రనౌత్- విద్యా బాలన్- పరిణీతి చోప్రా- సోనమ్ కపూర్ - జాన్వీ కపూర్ వంటి భామలు హై స్టాండార్డ్ ఉన్న బయోపిక్ కథలకు ఓకే చెబుతున్నారు.