మెగాస్టార్ కెరీర్ టాప్ -10 చిత్రాలివే!
మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రాల మార్క్ ని అధిగమించి వడివడిగా అడుగులు వేస్తున్నారు. బాస్ స్పీడ్ చూస్తుంటే వేగంగా 200 సినిమాల క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. కెరీర్ 150వ చిత్రంగా తమిళ బ్లాక్ బస్టర్ `కత్తి`ని తెలుగులో `ఖైదీ నంబర్ 150`గా రీమేక్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అందుకున్నారు. అది ఆయనకు కంబ్యాక్ సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. అటుపై `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` బయోపిక్ లో మెగాస్టార్ నటించారు. `సైరా నరసింహారెడ్డి` టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇది మెగాస్టార్ 152వ చిత్రం. మరి ఈ నంబర్ సాధించడానికి... ఈ స్థాయికి చేరుకోవడానికి చిరంజీవి గత సంచలనాలను నెమరు వేయాలి. చిరంజీవిని మెగాస్టార్ గా కీర్తించిన చిత్రాల గురించి వర్ణించడం అసాధ్యం. అప్పట్లో మెగాస్టార్ నటించిన ప్రతీ సినిమా ఆణిముత్యమే.. కళాఖండమే. మరి అలా మెగాస్టార్ కెరీర్ లో టాప్ 10 చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ..
మెగాస్టార్ ని కెరీర్ ని కీలక మలుపు తిప్పిన సినిమా `ఖైదీ`. చిరు మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచిన చిత్రమిది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. 1983లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటలు .. డైలాగులు చిరంజీవికి కొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇది మెగాస్టార్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఇక కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శరకత్వంలో చిరంజీవి `స్వయంకృషి`..`ఆపద్భాందవుడు`.. `శుభలేఖ` వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా `స్వయంకృషి` మెగాస్టార్ లోని సంపూర్ణ నటుడిని బయటకు తెచ్చిన సినిమాగా నిలిచింది.
1987 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంది. ఇందులో మెగాస్టార్ తనదైన శైలి డాన్సులు.. డైలాగులు లేనప్పటీకీ కేవలం కథా బలంతోనే హిట్ అందుకుంది. `ఛాలెంజ్` సినిమాతో మెగాస్టార్ యువతలో స్ఫూర్తిని రగిలించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారీ విజయాన్ని సాధించింది. మెగాస్టార్ కి మాస్ ఇమేజ్ పెంచిన చిత్రమిది. 1990లో రిలీజ్ అయిన `కొండవీటి దొంగ` చిత్రం మెగాస్టార్ ని యాక్షన్ స్టార్ గా పీక్స్ కి చేర్చింది. కౌబాయ్ లుక్ లో మెగాస్టార్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు.
ఇక మెగాస్టార్ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్స్ లో `జగదేకవీరుడు అతిలోక సుందరి` ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మ్యూజికల్ గా ముందే హిట్ అయింది. అటుపై రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రమైంది. అలాగే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఘరానా మొగుడు మాస్ లో బాస్ గా రాజ్యమేలింది. బాక్సాఫీస్ రికార్డుల్ని గడగడలాడించిన సినిమాగా రికార్డులకెక్కింది.
`గ్యాంగ్ లీడర్` సినిమాతో మెగా బ్రేక్ డ్యాన్సులు గొప్ప ట్రెండింగ్ అయ్యాయి. ఈ చిత్రంతోనూ మెగాస్టార్ కంప్లీట్ మాస్ స్టార్ గా ఆవిర్భవించారు. అందులో ఆయన మ్యానరిజమ్ అప్పటి ఫ్యాన్స్ లో ఓ ఊపు ఊపింది. 2000 లో చిరంజీవి సమకాలికులంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీలో బ్లాక్ బస్టర్లు కొట్టేస్తుంటే.. అదే సమయంలో సీమ నేపథ్యంతో మెగాస్టార్ `ఇంద్ర` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. రౌడీ అల్లుడు లో మెగా బాస్ ద్విపాత్రాభినయం కెరీర్ లోనే ఒక హైలైట్. ఇంకా `ఠాగూర్` గొప్ప కమర్షియల్ హిట్ గా నిలిచి తెలుగు ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యింది. పాన్ ఇండియా కేటగిరలలో రూపొందించిన `సైరా నరసింహారెడ్డి` మెగాస్టార్ కెరీర్ లో గొప్ప భారీతనం నిండిన క్లాసిక్ చిత్రంగా ఖ్యాతికెక్కింది. రాజకీయాల్లోకి వెళ్లి చాలా గ్యాప్ తర్వాత తిరిగి వస్తూ `ఖైదీ నంబర్ 150`తో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ మెగాస్టార్ సంచలనమే సృష్టించారు.