కళ్ళతోనే కవ్విస్తున్న కృతి శెట్టి.. ఫోటోలు వైరల్!
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ అందుకొని ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో కృతి శెట్టి కూడా ఒకరు.;
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ అందుకొని ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో కృతి శెట్టి కూడా ఒకరు. శాండిల్ వుడ్ సినీ పరిశ్రమ నుండి అడుగుపెట్టిన ఈమె.. ప్రముఖ దిగ్గజ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన తొలి పరిచయంలో దర్శకుడిగా వచ్చిన చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమా ద్వారానే హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో బేబమ్మ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు తన అందంతో మాయ చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు సొట్టబుగ్గల సుందరిగా ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది కృతి శెట్టి.
ఈ సినిమా అందించిన సక్సెస్ తో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించడమే కాకుండా ఇందులో బోల్డ్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' సీక్వెల్ 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్య సరసన నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఏకంగా హ్యాట్రిక్ అందుకొని సక్సెస్ అయ్యింది. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడిందనే చెప్పాలి . అందులో భాగంగానే ఈమె నటించిన చాలా సినిమాలు ఈమెకు విజయాన్ని అందించలేదు.
అలా సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇవేవీ కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. ఇక మలయాళంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కృతి శెట్టికి సరైన అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగులో చివరిగా కార్తీ , సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'అన్నగారు వస్తున్నారు' అనే సినిమాలో నటించింది . ఈ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ ను అందించలేదు.
సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ మరొకవైపు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే గ్లామర్ ఒలకబోస్తున్న ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మినీ డ్రెస్ ధరించిన ఈమె అందాలతో ఫాలోవర్స్ ను ఫిదా చేసే ప్రయత్నం చేసింది. కళ్ళతోనే కవ్విస్తూ మాయ చేస్తున్న ఈమె.. ఒకవైపు గ్లామర్ తో ఆకట్టుకుంటూనే మరొకవైపు దర్శక నిర్మాతల కంట్లో పడే ప్రయత్నం చేస్తున్న బేబమ్మకి కనీసం ఈసారైనా ఒక మంచి అవకాశం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దీనికి తోడు ఇటీవల చిరంజీవి - బాబి కాంబినేషన్లో వస్తున్న మెగా 158 సినిమాలో చిరంజీవికి కూతురుగా నటించబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈ వార్తలను కొట్టిపారేసింది చిత్ర బృందం. మరి ఇప్పటికైనా కృతి శెట్టికి ఒక మంచి అవకాశం లభించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.