స్పిరిట్.. సందీప్ రెబల్ ప్లానింగ్..!

ఇప్పుడు సందీప్ వంగ కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వెళ్తున్నాడట. స్పిరిట్ గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి ఇస్తూ సినిమాపై హైప్ పెంచేలా చేస్తున్నాడు.;

Update: 2026-01-25 08:30 GMT

పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు సందీప్ వంగ. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన అతను నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేశాడు. సినిమా కూడా 2027 మార్చి రిలీజ్ కి ప్లాన్ చేయగా దానికి తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.

సందీప్ వంగ సినిమా అంటేనే అది వేరే లెవెల్..

సందీప్ వంగ స్పిరిట్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాయి. ఐతే నెక్స్ట్ సందీప్ వంగ మెక్సికోలో షూటింగ్ ప్లాన్ చేశాడట. అక్కడ మెయిన్ కాస్ట్ తో షెడ్యూల్ ఉందని తెలుస్తుంది. ఐతే సినిమా తీయడం ఒక లెక్క అయితే దాన్ని ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడం మరో లెక్క అని తెలిసిందే. ఈ విషయంలో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తాడు.

ఇప్పుడు సందీప్ వంగ కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వెళ్తున్నాడట. స్పిరిట్ గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి ఇస్తూ సినిమాపై హైప్ పెంచేలా చేస్తున్నాడు. సందీప్ వంగ సినిమా అంటేనే అది వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇక అందులో ప్రభాస్ లాంటి హీరో ఉన్నాడంటే అది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో సందీప్ స్పిరిట్ సినిమా కథ కథనం కాదు ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ తోనే ఒక హై ఇస్తుందని రెబల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ప్రభాస్ ఫౌజీతో ఖుషి.. స్పిరిట్ తో సత్తా..

ప్రభాస్ స్పిరిట్ సినిమాతో పాటు హను తో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఐతే ఫౌజీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ రాజా సాబ్ తో వచ్చి నిరాశపరిచాడు ప్రభాస్ సో ఫౌజీతో ఖుషి చేసి స్పిరిట్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు ప్రభాస్. సంప్దీ వంగ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి స్పిరిట్ తో చూపిస్తాడని అంటున్నారు. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన త్రిప్తి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా సందీప్ వంగ ప్రభాస్ కు జతగా ఆమెను ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత త్రిప్తికి మరిన్ని క్రేజీ ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.

సందీప్ వంగ ప్రభాస్ ఇద్దరు కలిసి చేస్తున్న స్పిరిట్ సినీ ప్రియులకు ఒక మాస్ ఫీస్ట్ అందిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో తనపై అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న సందీప్ స్పిరిట్ తో వేరే లెవెల్ మాస్ చూపిస్తాడని అంటున్నారు. మరి అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News