వెంకటేష్ హీరోగా హిట్ మెషిన్ ఫిక్స్!
కానీ అనీల్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. నాగార్జునతోనూ ముందుకెళ్లలేదు. పవన్ కళ్యాణ్ ని పట్టించుకోలేదు. మల్టీస్టారర్ చేయడం లేదు. కూల్ గా మరోసారి విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.;
హిట్ మెషిన్ అనీల్ రావిపూడి 10వ సినిమా హీరో ఫిక్స్ అయిపోయాడా? మరోసారి సీనియర్ స్టార్ తోనే ముందుకెళ్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే `మన శంకర వరప్రసాద్ గారు` తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అనీల్ వరుసగా తొమ్మిది విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేసాడు. రాజమౌళి తర్వాత ఆ రికార్డు అనీల్ దే. దీంతో పదవ సినిమా ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి స్టోరీతో వస్తాడు? అన్న చర్చ `ఎమ్ ఎస్ జీ` రిలీజ్ అనంతరమే మొదలైపోయింది. ఈ విషయంలో అనీల్ కూడా అభిమానుల్ని పెద్దగా గందరగోళానికి గురి చేయలేదు.
రెండు వారాల విరామం అనంతరం ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతానని వెల్లడించాడు. అయితే హీరో ఎవరు? అన్న దానిపై రకరకాల ఊహగానాలు తెరపైకి వచ్చాయి. బాలయ్య, చిరంజీవి, వెంకీలను ఇప్పటికే డైరెక్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి హీరో కింగ్ నాగార్జున అవుతారని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు. ఆయన కాకపోతే పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ తో ఛాన్స్ అందుకుంటాడని అనుకున్నారు. వీరిద్దరు కాకపోతే సమయం తీసుకున్నా? చిరంజీవి ఎలాగూ వెంకటేష్ తో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు కాబట్టి ఆ కలయికలో చేస్తాడనుకున్నారు.
కానీ అనీల్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. నాగార్జునతోనూ ముందుకెళ్లలేదు. పవన్ కళ్యాణ్ ని పట్టించుకోలేదు. మల్టీస్టారర్ చేయడం లేదు. కూల్ గా మరోసారి విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్ర విషయమై ఇప్పటికే చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని తెలిసింది. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. అయితే ఆ కథను పూర్తి స్థాయిలో సిద్దం చేయాల్సి ఉంది. అందుకు అనీల్ కొంత సమయం తీసుకుంటున్నాడు. అన్ని పనులు పూర్తి చేసి జూన్ లో ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని స్నాహాలు చేస్తున్నాడుట.
అలాగే నిర్మాత కూడా సాహూ గారపాటిగా తెలిసింది. 2027 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనీల్ ప్లాన్ చేసుకుంటున్నాడుట. ప్రస్తుతం వెంకేటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` తెరకెక్కు తోంది. దీంతో పాటు త్వరలో `దృశ్యం 3` షూటింగ్ కూడా మొదల వుతుంది. జూన్ లోగా గురూజీ సినిమా సూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలోనే అనీల్ జూన్ నుంచి షూట్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవెంకటేష్- అనీల్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.