ఆ యంగ్ హీరోకీ శ్రీలీల రెండవ నాయిక?
తానే హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసాడు. తాజాగా సెకెండ్ లీడ్ కోసం శ్రీలీలను తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే శ్రీలీలకు స్టోరీ నేరేట్ చేసాడుట.;
తెలుగు హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో సెలక్టివ్ గా వెళ్తోన్న సంగతి తెలిసిందే. మునుపటిలా గ్లామర్ పాత్రలకు ఒకే చెప్పడం లేదు. సెకెండ్ లీడ్స్ కు ఛాన్స్ తీసుకోవడం లేదు. పాత్రలో గొప్పతనం..ఔన్నత్యం చూసి సైన్ చేస్తుంది. పారితోషికం కోసం కాకుండా ఫీజ్ తక్కువగా వచ్చినా? మంచి పాత్రలు మాత్రమే చేయాలని బలంగా డిసైడ్ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో తెలుగు సినిమాల్ని వదులుకోవడానికి కూడా సిద్దంగా ఉంది. ఇప్పటికే తాను అనుకున్న ప్రణాళిక కూడా ఆచరణలోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా బాలీవుడ్ లో చిన్న హీరోలతో పని చేయడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయడం లేదు.
సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందంటే కమిట్ అయిపోతుంది. ఇప్పటికే అమ్మడు హిందీలో రెండు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వాటి రిలీజ్ కు ముందే కొత్త అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అలాగని అమ్మడు కంగారు పడలేదు. మరో తప్పిదం జరగకుండా ఆచితూచి వ్యహరిస్తోంది. అలాగే తమిళ్ లో కూడా సినిమాలు కమిట్ అవుతోంది. తాజాగా కోలీవుడ్ హీరోం కం డైరెక్టర్ ప్రదీప్ రంగనాధ్ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. `లవ్ టుడే` తర్వాత మరోసారి కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు.
తానే హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసాడు. తాజాగా సెకెండ్ లీడ్ కోసం శ్రీలీలను తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే శ్రీలీలకు స్టోరీ నేరేట్ చేసాడుట. పాత్ర నచ్చడంతో శ్రీలీల మరో ఆలోచన లేకుండా కమిట్ అయిందని తెలిసింది. శ్రీలీల ఇలా కమిట్ అవ్వడం చూసి టాలీవుడ్ షాక్ అయింది. తెలుగు హీరోల్ని కాదని తమిళ సినిమాలకు సైన్ చేస్తుందా? అన్న గుసాయింపు తెరపైకి వస్తోంది. అఖిల్ సినిమా `లెనిన్` లో ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను ఎంచుకున్నారు. కానీ డేట్లు సర్దుబాటు కావడం లేదని లెనిన్ నుంచి తప్పుకుంది. అదే సమయంలో బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది.
దీంతో శ్రీలీల కావాలనే తెలుగు సినిమాలకు కమిట్ అవ్వడం లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రదీప్ కి జోడీగా సెకెండ్ లీడ్ కి కూడా ఒకే చెప్పిందంటే? శ్రీలీల పాత్రలను ఎంత బలంగా నమ్ముతుంది? అన్నది అద్దం పడుతుంది. ప్రదీప్ గత సినిమా `డ్రాగన్` లో సెకెండ్ లీడ్ పోషించిన కయాదు లోహార్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో తెలిసిందే. రెండవ నాయిక అయినా సినిమా విజయం సాధించడం..పాత్ర గుర్తింపుతో మంచి అవకాశాలు అందుకుంటుంది. శ్రీలీల కూడా అలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తోంది.