టాలీవుడ్ టాప్ రీజినల్ గ్రాసర్స్ లో 'మన శంకరవరప్రసాద్ గారు'
ఈ రేసులో విక్టరీ వెంకటేష్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా సుమారు రూ. 245 కోట్ల మార్కును అందుకుని మూడో స్థానంలో నిలిచింది.;
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త రికార్డు నమోదైనట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో.. కేవలం రీజినల్ మార్కెట్ (హిందీలో రిలీజ్ కాకుండా) మీదనే ఫోకస్ పెట్టి భారీ వసూళ్లు రాబట్టడం ఒక సవాల్. అలాంటి ఛాలెంజ్ లో మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మెగాస్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత కొన్నేళ్లుగా రీజినల్ పరంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' నిలిచింది. కానీ ఇప్పుడు ఆ రికార్డును చిరంజీవి అధిగమించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ లో వింటేజ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే హీరోగా క్రేజ్ తెచ్చుకున్న మెగాస్టార్.. ఈసారి కూడా పండుగను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 12 రోజుల్లోనే బన్నీ రికార్డును బ్రేక్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. నిన్న 13వ రోజు నాడు బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 101.79కే టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ స్టామినాకు నిదర్శనం. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 255 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ వసూళ్లతో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సాధించిన రూ. 250 కోట్ల రికార్డును ఈ సినిమా దాటేసింది.
ఈ రేసులో విక్టరీ వెంకటేష్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా సుమారు రూ. 245 కోట్ల మార్కును అందుకుని మూడో స్థానంలో నిలిచింది. మూడు కూడా పండగ సీజన్ లో వచ్చినవే, టాప్ 3 లిస్టులోకి చేరడం విశేషం. అయితే మెగాస్టార్ మాత్రం అందరికంటే ముందుండి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
నేటి జనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టుగా అనిల్ రావిపూడి ఈ కథను ఎంటర్టైన్మెంట్ తో తీర్చిదిద్దడమే ఈ సక్సెస్ కు సీక్రెట్. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు క్యూ కట్టడం వల్ల ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. 'మన శంకరవరప్రసాద్ గారు' సాధించిన ఈ ఘనత రీజినల్ సినిమాల స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
టాలీవుడ్ టాప్ రీజినల్ గ్రాసర్స్.. హిందీ రిలీజ్ లేకుండా.. ట్రేడ్ అంచనాల ప్రకారం..
మన శంకరవరప్రసాద్ గారు: రూ.255 కోట్లు+ (ఇంకా రన్ అవుతోంది)
అల వైకుంఠపురములో: రూ.250 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం: రూ.245 కోట్లు