స్పిరిట్ ఓవర్సీస్ వేట.. నెవ్వర్ బిఫోర్..
సందీప్ రెడ్డి వంగా గత సినిమాలు 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి.;
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్టార్‌డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా రాజాసాబ్ తేడా కొట్టినా నెక్స్ట్ ప్రాజెక్టులపై ఎఫెక్ట్ పెద్దగా పడలేదని అర్ధమవుతుంది. ప్రభాస్ సినిమా వస్తోందంటే చాలు బిజినెస్ వర్గాల్లో ఒక రకమైన ప్రకంపనలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోతున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండి కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ బజ్ క్రియేట్ అయ్యింది.
ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా.. బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ.. ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ మూవీ థియేట్రికల్ హక్కుల కోసం అప్పుడే పోటీ మొదలైపోయింది. ఈ క్రేజ్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. స్పిరిట్ ఓవర్సీస్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీని షాక్ కి గురిచేస్తోంది. విదేశీ మార్కెట్ లో ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఊహించని డిమాండ్ నెలకొంది. ట్రేడ్ టాక్ ప్రకారం ఓవర్సీస్ హక్కుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ప్రభాస్ కు ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్ వల్లే ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
సందీప్ రెడ్డి వంగా గత సినిమాలు 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ తో పోలీస్ ఆఫీసర్ గా సినిమా తీస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఎంత రేటు పెట్టి అయినా హక్కులు దక్కించుకుంటే లాంగ్ రన్ లో భారీ లాభాలు వస్తాయని వారి నమ్మకం. ఈ రేంజ్ కాంపిటీషన్ చూస్తుంటే స్పిరిట్ ఓవర్సీస్ బిజినెస్ ఒక రేంజ్ లో క్లోజ్ అయ్యేలా ఉంది.
నేటి జనరేషన్ ఆడియన్స్ కు సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉంది. రా అండ్ ఇంటెన్స్ డ్రామాను ఆయన ప్రెజెంట్ చేసే విధానం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై యూత్ లో స్ట్రాంగ్ హైప్ ఉంది. ప్రభాస్ వింటేజ్ మాస్ లుక్ తో పాటు సందీప్ మార్క్ వైలెన్స్ ఈ సినిమాలో పీక్స్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందుకే బిజినెస్ లెక్కలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
'స్పిరిట్' షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి రావడానికి ఇంకా సమయం ఉన్నా.. బిజినెస్ వరల్డ్ లో మాత్రం ప్రభాస్ ప్రకంపనలు మొదలైపోయింది. ఓవర్సీస్ లో ఈ సినిమా సాధించబోయే రికార్డులు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ప్రభాస్ సందీప్ వంగా కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.