MSGకి రిలీజ్ కు ముందే లాభాలా? నిర్మాత ఏమన్నారంటే?

మార్కెట్ పరిస్థితి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అంచనాలు ఏమైనా ఉన్నా, ప్రాజెక్ట్ విషయంలో తాము ఎప్పుడూ సేఫ్ జోన్‌ లోనే ఉన్నామని సాహు గారపాటి తెలిపారు.;

Update: 2026-01-25 09:30 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ తన కెరీర్‌ లోనే కలెక్షన్ల పరంగా, గుర్తింపు పరంగా, రేంజ్ పరంగా పెద్ద సినిమా అని నిర్మాత సాహు గారపాటి స్పష్టం చేశారు. మూవీ హిట్ అయిన నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. ఆ సమయంలో సినిమా జర్నీ, దర్శకుడు అనిల్ రావిపూడితో పని చేసిన అనుభవం, వసూళ్ల వివరాలు వెల్లడించారు.

సాహు గారపాటి మాట్లాడుతూ, "నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మన శంకర వరప్రసాద్ గారునే అతిపెద్ద సినిమా. కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, నాకు వచ్చిన గుర్తింపు, సినిమా రేంజ్ అన్నింట్లో ఇదే టాప్" అని తెలిపారు. సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చాలా కంఫర్ట్‌ గా వర్క్ చేశామని, మొదటి నుంచే ఇద్దరం ప్రతి విషయాన్ని ఓపెన్‌ గా మాట్లాడుకున్నామని చెప్పారు.

అందువల్ల స్క్రిప్ట్ నుంచి షూటింగ్ వరకు అన్నింటిలో స్పష్టత ఉండేదని, అదే సినిమా సక్సెస్‌ కు ప్రధాన కారణమని అన్నారు. మార్కెట్ పరిస్థితి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అంచనాలు ఏమైనా ఉన్నా, ప్రాజెక్ట్ విషయంలో తాము ఎప్పుడూ సేఫ్ జోన్‌ లోనే ఉన్నామని సాహు గారపాటి తెలిపారు. "హీరో గారు మాకు పూర్తి కంఫర్ట్ ఇచ్చారు. దర్శకుడు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ హ్యాపీగా వర్క్ చేశారు" అని చెప్పారు.

"షూటింగ్ సమయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా పూర్తయ్యింది. ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా, అందరూ కలిసి మాట్లాడుకునే పరిష్కరించుకున్నాం. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే సినిమాను తెరకెక్కించాం" అని వివరించారు. సినిమా ఆర్థికంగా కూడా అరుదైన విజయాన్ని అందుకుందని నిర్మాత తెలిపారు. రిలీజ్‌ కు ముందే టేబుల్ ప్రాఫిట్ ప్రాజెక్ట్‌ గా మారిందని చెప్పారు.

అంటే విడుదలకు ముందే పెట్టుబడి తిరిగి వచ్చేసినట్లే. "రిలీజ్ అయిన తర్వాత బయ్యర్స్‌కు లాభాలు వచ్చాయి. ఎగ్జిబిటర్స్‌ కూ మంచి ప్రాఫిట్ వచ్చింది. సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోనే ఉన్నారు. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ను పూర్తి చేసుకున్నాం" అని సంతోషం వ్యక్తం చేశారు. రీజనల్ హిట్ సాధించడం అంత ఈజీ కాదని, తక్కువ సినిమాల్లో తనకు ఆ అదృష్టం దక్కిందని సాహు గారపాటి అన్నారు.

"ప్రాంతీయంగా పెద్ద హిట్ కొట్టడం చాలా కష్టం. అలాంటి విజయం నాకు దక్కడం నిజంగా అదృష్టం. మూవీ సక్సెస్‌ కు సంబంధించిన క్రెడిట్ అంతా మెగాస్టార్ చిరంజీవి గారికే, అలాగే దర్శకుడు అనిల్ రావిపూడికే ఇస్తున్నాం" అని తెలిపారు. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా, నిర్మాత సాహు గారపాటి కెరీర్‌ లోనే మైలురాయిగా నిలిచిందని చెప్పాలి.

Tags:    

Similar News