బిగ్ బాస్ క్రేజ్.. అమర్ దీప్ షాకింగ్ కామెంట్స్..!
సీజన్ 2లో కౌశల్ కి సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఐతే ఆ తర్వాత ఎవరు అతన్ని పట్టించుకోలేదు. సీజన్ 5 గెలిచిన వీజే సన్నీ కూడా హీరోగా ట్రై చేశాడు.;
బిగ్ బాస్ షో నడుస్తున్నంత కాలం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చాలా రకాల డిస్కషన్స్ జరుగుతాయి. కొందరికి ఫ్యాన్స్ కూడా ఏర్పడతారు. ఐతే ఆఫ్టర్ బిగ్ బాస్ అంత క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు సైతం సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. హౌస్ లో ఉన్నప్పుడు తమకు ఓట్లు వేసి అండగా ఉన్న ఫాలోవర్స్ అంతా కూడా షో అయ్యాక పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ ఫాలోయింగ్ చూసి తమకు స్టార్ రేంజ్ వచ్చిందని అనుకుంటే మాత్రం పొరపడినట్టే అవుతుంది.
బిగ్ బాస్ క్రేజ్ తో హీరోగా..
బిగ్ బాస్ సీజన్ 1 నుంచి రీసెంట్ గా పూర్తైన సీజన్ 9 వరకు విన్నర్, రన్నర్ తో పాటు టాప్ 5 కంటెస్టెంట్స్ కి కూడా ఒక రేంజ్ ఫాలోయింగ్ వస్తుంది. ఐతే ఆ క్రేజ్ ని చూసుకుని సినిమాల్లో హీరోగా ట్రై చేస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. సీజన్ 1 శివ బాలాజి విన్నర్ అయ్యాడు. ఆ క్రేజ్ తో తనే నిర్మాతగా స్నేహమేరా జీవితం సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయ్యింది.
సీజన్ 2లో కౌశల్ కి సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఐతే ఆ తర్వాత ఎవరు అతన్ని పట్టించుకోలేదు. సీజన్ 5 గెలిచిన వీజే సన్నీ కూడా హీరోగా ట్రై చేశాడు. కానీ వర్క్ అవుట్ కాలేదు. సీజన్ 4 సోహైల్ కూడా తను లీడ్ రోల్ బూట్ కట్ బాలరాజు సినిమా తీశాడు. షోలో ఉన్నంతసేపు అతన్ని అండగా ఉన్న ఆడియన్స్ సినిమా చూస్తే పట్టించుకోలేదు. ఈ విషయంలో సోహైల్ కూడా రిలీజ్ టైం లో ఎమోషనల్ అయ్యాడు.
ఏక్ దిన్ కా రాజా అన్నట్టే..
ఐతే బిగ్ బాస్ టైం లో మనతో ఉన్న వాళ్లంతా థియేటర్లు వస్తారని అనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్. మనం చేయాలో అది చేసి నిరూపించుకోవాలే తప్ప బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదా అని సినిమాలు చేయకూడదని అన్నాడు. బిగ్ బాస్ అంతా ఏక్ దిన్ కా రాజా అన్నట్టే ఉంటుంది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఈవెట్స్ తో ఎలా ఉపయోగించుకోవాలన్నది మాత్రం తెలుసుకోవాలని అన్నాడు అమర్ దీప్.
అమర్ దీప్ కి ఈ అనుభవం ఎలా వచ్చిందో తెలియదు కానీ అదే నిజం. బిగ్ బాస్ లో ఉన్న టైంలో ఫాలోవర్స్ ని చూసి మన రేంజ్ పెరిగిందని ఊహించుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారు. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అలా ఫాలోవర్స్ ని ఫ్యాన్స్ గా మార్చుకోవాలి. అంతేకానీ బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదా అలానే సినిమాలు చూసేస్తారు అనుకుంటే పొరబడినట్టే. స్టార్ సినిమాలకే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదు. బిగ్ బాస్ లో చూసి అతని సినిమా చూడటం అనేది చాలా రేర్. ఐతే మనం చేసే పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది కాస్త లేట్ అయినా వస్తుందని అంటున్నాడు అమర్ దీప్. ప్రస్తుతం సుమతీ శతకం సినిమాలో లీడ్ రోల్ చేసిన అమర్ దీప్ త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.