• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాబోయే సినిమాలపై ఓ...

రాబోయే సినిమాలపై ఓ క్లారిటీ...

By - Tupaki Desk
Update: 2016-05-26 08:31 GMT
సమ్మర్లో భారీ సినిమాల సందడికి తెరపడ్డట్లే. ఒక బ్లాక్ బస్టర్.. రెండు డిజాస్టర్లతో సమ్మర్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇక జూన్ నుంచి కొత్త సీజన్ ఆరంభం కాబోతోంది. భారీ సినిమాలు తెరపి ఇవ్వడంతో ఇక మళ్లీ మీడియం-చిన్న మీడియం సినిమాల సందడి మొదలుకాబోతోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు ప్రతి వారానికి సినిమాల షెడ్యూళ్లు దాదాపు ఖరారైపోయాయి. ముందుగా జూన్ 2న ‘అ..ఆ’ భారీ అంచనాల మధ్య రాబోతోంది.

తర్వాతి వారం సందీప్ కిషన్ ‘ఒక్క అమ్మాయి తప్ప’తో పాటు సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’ కూడా రిలీజవుతుంది. 17న నాని సినిమా ‘జెంంటిల్ మన్’ మంచి క్రేజ్ మధ్య విడుదల కాబోతోంది. తర్వాతి వారం మెగా ప్రిన్సెస్ కొణిదెల నీహారిక కథానాయికగా పరిచయం కాబోతున్న ‘ఒక మనసు’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆపై వారం తెలుగు సినిమాలేవీ రిలీజవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే జులై 1న సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ తమిళ-తెలుగు భాషల్లో విడుదలవుతుంది.

‘కబాలి’ వచ్చిన వారానికి విక్టరీ వెంకటేష్ సినిమా ‘బాబు బంగారం’ను ప్లాన్ చేస్తున్నారు. ఇక జులై 15న నాగచైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ షెడ్యూల్ అయి ఉంది. చైతూ నటిస్తున్న మరో సినిమా ‘ప్రేమమ్’ ఇంకో రెండు వారాల గ్యాప్ లో.. అంటే జులై 29న విడుదల చేయాలనుకుంటున్నారట. అంతటితో చిన్న-మీడియం సినిమాల సందడికి తెరపడుతుంది. ఆగస్టులో ‘జనతా గ్యారేజ్’ విడుదలవుతుంది. 12న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీనికి ముందు.. తర్వాతి వారాల్లో వేరే సినిమాలేవీ విడుదల కాకపోవచ్చు.
Tags:    
  • TOllywood Upcoming Movies 
  • Telugu nEws 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS