• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ స్టార్స్.. ఇదేమి...

టాలీవుడ్ స్టార్స్.. ఇదేమి దరిద్రమో..?

By - Tupaki Desk
Update: 2022-11-01 11:37 GMT
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఇప్పుడు లేనివిధంగా పెద్ద హీరోలకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలు స్ట్రాంగ్ గానే మొదలవుతున్నప్పటికీ కూడా షూటింగ్ దశలోకి వచ్చే వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అంతేకాకుండా మరికొందరు మేకింగ్ విధానంలో విడుదల తేదీ విషయాలలో కూడా చిక్కులు పడుతున్నారు.

ఇక అందరికంటే ముందుగా ప్రభాస్ ఐతే బాహుబలి తర్వాత అసలైన సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి విడుదల తేదీపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ ఎదుర్కొన్న ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక రాంచరణ్ 15 సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది.

మరోవైపు శంకర్ ఇండియన్ 2 సినిమాను స్టార్ట్ చేయడం వలన రామ్ చరణ్ సినిమాపై ప్రభావం పడింది. అందుకే సినిమా ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోయే ఎన్టీఆర్ 30వ సినిమా కూడా షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలు కావడానికి చాలా సమయం తీసుకుంది.

ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులలో కోఆర్డినేషన్ మిస్ కావడంతో మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి మరోసారి చర్చలు జరపాల్సి వస్తుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ మొదలు కావడానికి కూడా చాలా సమయం తీసుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా షూటింగ్ అయిన సుకుమార్ తొందరగా ఫినిష్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

అయితే అందరి పరిస్థితి ఒకలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒప్పుకున్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. హరిష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాల్సింది. అలాగే సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ రాజకీయాల కారణంగా అలాగే ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా టాలీవుడ్ అగ్ర హీరోలు కాస్త బ్యాడ్ టైం ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • StarHeros 
  • Prabhas 
  • NTR 
  • RamCharan 
  • PawanKlayan 
  • PanIndia 
  • Movies 
  • Hit 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS