కేరళపై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు!
ఇప్పుడు టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో పలు రీమేకులు ఉన్నాయి. అయితే.. రీమేకులందు మలయాళీ రీమేకులు వేరయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. టాలీవుడ్ అరువు తెచ్చుకుంటున్న కథల్లో.. కేరళ చిత్రాలే ఎక్కువగా ఉండడం విశేషం. ఇప్పటికే పలువురు అగ్రహీరోలు మోలీవుడ్ సినిమాలను రీమేక్ చేస్తుండగా.. ఇప్పుడు మరో హీరో వీళ్ల జాబితాలో చేరుతున్నట్టు సమాచారం.
పవర్ స్టార్ - రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ మలయాళీ చిత్రమే. కేరళలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్లు రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
మెగాస్టార్ నెక్స్ట్ మూవీ లూసీఫర్ రీమేక్ అన్నది అందరికీ తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే కొబ్బరి కాయ కొట్టారు. తెలుగు నేటివిటీతోపాటు, మెగా అభిమానులను అలరించే అంశాలను కూడా యాడ్ చేసి స్క్రిప్టు తిరగరాశారు. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది యూనిట్.
ఇక, మలయాళీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ మరో టాప్ హీరో వెంకటేష్. ఇటీవల రిలీజై ఘన విజయం సొంతం చేసుకున్న దృశ్యం-2ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు వెంకీ. మలయాళం వెర్షన్ ను రూపొందించిన జీతూనే తెలుగు వెర్షన్ ను కూడా తెరకెక్కించబోతున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మరో మలయాళీ మూవీ తెలుగులో పునర్ నిర్మాణం కాబోతోంది. అక్కడ ఘన విజయం సాధించిన 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ హక్కులను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నారట. అయితే.. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కలిసి నటించబోతున్నట్టు సమాచారం.
ఒరిజినల్ లో పృథ్విరాజ్ చేసిన సినిమా హీరో పాత్రను రవితేజ పోషించనుండగా.. సూరజ్ కనిపించిన ఆర్టీవో ఇన్ స్పెక్టర్ పాత్రలో సేతుపతి నటిస్తాడని తెలుస్తోంది. మరి, ఇందులో నిజమెంత? ఎవరు డైరెక్ట్ చేస్తారు? వంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మొత్తానికి తెలుగు హీరోలు కేరళపై మనసు పారేసుకున్నారనే మాట నిజమే కదూ..!