లేడీ జ‌ర్న‌లిస్టుని చంపేస్తాన‌ని స్టార్ హీరో వార్నింగ్!

Update: 2020-04-30 07:30 GMT
మీడియాతో సెల‌బ్రిటీ స్నేహం ఎంత స‌హ‌జ‌మో.. కిటుకులు బ‌య‌టికి తీశాక‌ వైరం కూడా అంతే స‌హ‌జం. సాధ్య‌మైనంత వ‌ర‌కూ స్నేహంగా అన్నిటినీ కానిచ్చేయాల‌‌ని సెల‌బ్రిటీ ప్ర‌య‌త్నించినా.. స‌ద‌రు సెల‌బ్రిటీ గుట్టు మ‌ట్ల‌పై క‌థ‌నాలు రాయ‌డం మీడియాల ప‌ని. అందుకే ఆ ఇరువురి న‌డుమ స‌న్న‌ని లైన్ అడ్డుగోడ‌గా నిలుస్తుంటుంది. ఆ అడ్డుగోడ కూడా తొల‌గిపోతే ఫైరింగే. అలానే ఆ హీరో స‌ద‌రు లేడీ జ‌ర్న‌లిస్టుని చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చేంత‌వ‌ర‌కూ వెళ్లింది. ఇది పాత విష‌య‌మే అయినా.. ఇప్ప‌టికీ తెలుగు సినీమీడియాలో హాట్ టాపిక్. సెల‌బ్రిటీలంతా మీడియా సొద‌రులు .. మీడియా మిత్రులు అంటూ సుతిమెత్త‌గా తియ్య‌గా పిలిచినా లోలో‌న వీళ్లంటేనే మండిపోయే బ్యాచే ఎక్కువ‌. అలాగేని మీడియాని త‌క్కువ చేయాల్సిన ప‌నిలేదు. టీ.ఆర్.పీల కోసం.. ప‌త్రిక‌ల పాపులారిటీ కోసం పాకులాడే క్ర‌మంలో సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి తొంగి చూడ‌టం లేనిపోనివి రాయ‌డం కొన్ని‌ మీడియాల‌కు  ఓ అల‌వాటు. రూమ‌ర్లు..గాసిప్పులు అంటూ ఎప్పూడు మీడియా నుంచి సెల‌బ్రిటీల‌కు తిప్ప‌లైతే త‌ప్ప‌వు.

అయితే కొన్నిసార్లు త‌ప్పు చేయ‌క‌పోయినా కొన్ని కొన్ని జ‌రిగిపోతుంటాయి. అలాంటి రాత‌లే టాలీవుడ్ వెట‌ర‌న్ హీరో భ‌గ‌భ‌గ మండ‌డానికి కార‌ణ‌మైంది. స‌ద‌రు స్టార్ హీరోపై ఓ లేడీ జ‌ర్న‌లిస్ట్ రాసిన ఓ ప్ర‌త్యేక క‌థ‌నం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ఆ టాపిక్ తాజాగా లాక్ డౌన్ వేళ‌.. సోష‌ల్ మీడియాలో వాడి వేడిగా చ‌ర్చ‌కొస్తోంది. 2011 లో ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో కం నిర్మాత‌పై ఓ ప్ర‌త్యేక క‌థ‌నం రాసారు. అందులో ఎన్నో పాజిటివ్ విష‌యాల‌తో పాటు కొన్ని నెగిటివ్ విష‌యాల్ని ఓపెన్ గా చ‌ర్చించారు. ఆ క‌థ‌నం చ‌దివిన స‌ద‌రు స్టార్ హీరో పాత్రికేయురాలిపై అంతెత్తున ఎగిరిప‌డ్డారు. ఓ సినిమా ఇంట‌ర్వ్యూ కోసం స‌ద‌రు హీరోగారి స్టూడియోకి వ‌చ్చిన ఆ పాత్రికేయురాలు తార‌స‌ప‌డ‌టంతో హీరో తీవ్రంగా మండిప‌డ్డ‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వేడెక్కించాయి.

ఆమెను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడ‌ని....చంపేస్తాన‌ని బెందిరింపుల‌కు దిగార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. దీంతో స‌ద‌రు పాత్రికేయురాలు ఆ హీరోపై 506..509 సెక్ష‌న్ ల కింద కేసులు కూడా న‌మోదు చేశార‌ని ప్ర‌చార‌మైంది. అప్ప‌టి నుంచి ఆ పత్రిక ఆ అగ్ర హీరో సినిమాల‌ను క‌వ‌ర్ చేయ‌డం మానేసింది. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి వ‌రుస‌గా నెగిటివ్ క‌థ‌నాలు ప్ర‌చురించింది. స‌ద‌రు ప‌త్రిక‌లో వ‌చ్చిన‌ విష‌యాల‌ను వెబ్  మీడియా మ‌రింత వేడెక్కించింది. అప్ప‌టి నుంచి మీడియా వాళ్లు అంటేనే ఆ హీరో ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఇప్ప‌టికీ చెప్పుకుంటుంటారు. ఎవరిని ఎక్క‌డ పెట్టాలో అక్క‌డే పెడ‌తార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. స్టార్ల‌తో ఫిల్మ్ మీడియాకు అప్పుడ‌ప్పుడు ఇలాంటి వైరం స‌హ‌జమే.. కానీ మ‌రీ ఇంత ప్ర‌తీకార‌మా? అని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి.  గ‌తంలో ద‌ర్శ‌కుడు వి. ఎన్ ఆదిత్య‌- ఓ జాతీయ పత్రిక పాత్రికేయుడి మ‌ధ్య ఇలాంటి క‌థ‌నంపైనే ఇద్ద‌రి మధ్యా నువ్వా  నేనా? అన్న‌ట్లుగా వార్ జ‌రిగింది.  కొన్నాళ్ల‌కి అది చ‌ల్ల‌బ‌డింది అనుకోండి.
Tags:    

Similar News