పూరి కంబ్యాక్ కోసం స్టార్స్ వెయిటింగ్!
స్టార్ హీరోలకు వరుస ప్లాప్ లు ఎదురైన క్రమంలో అభిమానులు సహా ఇండస్ట్రీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఎప్పుడెప్పుడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.;
స్టార్ హీరోలకు వరుస ప్లాప్ లు ఎదురైన క్రమంలో అభిమానులు సహా ఇండస్ట్రీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఎప్పుడెప్పుడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వెండి తెరపై మెరిసిన అభిమానుల నటుల విషయంలో ఇది సహజంగా కనిపిస్తుంటుంది. వైఫల్యంలో ఉన్న డైరెక్టర్ల విషయంలో కనిపిస్తుంటుంది. కానీ హీరోలపై ఉన్నంత ప్రభావం డైరెక్టర్ విషయంలో ఉండదు. ఎందుకంటే డైరెక్టర్ అనే వాళ్లు కేవలం తెర వెనుక పాత్రధారులు కాబట్టి ఆ ఇంపాక్ట్ కనిపించదు. కానీ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాత్రం అందుకు భిన్నం. గత కొంత కాలంగా పూరి డైరెక్ట్ చేస్తోన్న చిత్రాలేవి సరైన విజయం సాధించడం లేదు.
`ఇస్మార్ట్ శంకర్` హిట్ అయినా? ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయినవే. దీంతో నాటి నుంచి పూరి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడా? అని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్లలో పూరికంటూ ప్రత్యేకమైన అభిమానులున్నారు. హీరో రేంజ్ ఫాలోయింగ్ పూరికి ఉందన్నది కాదనలేని నిజం. పూరి కోసమే సినిమాలు చూసే అభిమానులెంతో మంది. ఓ సాధారణ ప్రేక్షకుడే కాదు పూరి కంబ్యాక్ కోసం బిగ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ సైతం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పూరి గురించి ప్రభాస్ చాలా సందర్భాల్లో గర్వంగా మాట్లాడారు. ఇండియాలో హీరో క్యారక్టరేజేషన్ మీద స్టోరీ రాగయల ఏకైక డైరెక్టర్ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ కూడా వారణాసి ప్రమోషన్ లో భాగంగా జాతీయ మీడియా ముందు పూరి తెరకెక్కించిన `పోకిరి` తనని ఎంత పెద్ద స్టార్ గా మలిచిందో మరోసారి గుర్తు చేసుకున్నారు. తాను పని చేసిన దర్శకులందరిలో పూరి ఎంతో ప్రత్యేకమంటూ ఆకాశానికి ఎత్తేసారు. అలాగే రామ్ చరణ్ కూడా పూరి విషయంలో అంతే పాజిటివ్ గా ఉంటారు. చరణ్‌ని వెండి తెరకు పరిచయం చేసింది పూరినే.
అతడు తెరకెక్కించిన `చిరుత`తోనే చరణ్ స్టార్ అయ్యాడు. ఆ చనువుతోనే పూరి మనసులో బాదను కూడా ఓ సందర్భంలో చరణ్ ముందుంచాడు. ఏంటో చేస్తోన్న సినిమాలన్నీ ఫెయిలవుతున్నాయని పూరి, చరణ్ ముందు అనగా తప్పకుండా స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తారంటూ బూస్టింగ్ ఇచ్చాడు చరణ్. అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుందని ఆ నాడే రివీల్ అయింది. ప్రభాస్ -పూరి కూడా మంచి స్నేహితులుగా మెలుగుతారు. ఇద్దిరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `బుజ్జిగాడు` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అటుపై `ఏక్ నిరంజన్` కూడా అదే కాంబోలోప్రేక్షకుల ముందుకొచ్చింది. మహేష్ -పూరి కలయికలో `పోకిరి`, `బిజినెస్ మెన్` చిత్రాలు మంచి విజయాలు నమోదు చేసినవే. అంతేనా పూరి కంబ్యాక్ కోసం అభిమానులు సహా ఇండస్ట్రీలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పూరి సినిమాలను పంపిణీ దారులు భారీ లాభాలు చిత్రాలు తేచ్చే వాటిగా పరిగణిస్తారు.