చిరు కోసం రాధిక అలా అన్నారా.. అసలు విషయమిదే..
ఆ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు చేసిన రాధిక, ఆయన కంటే మోహన్ లాల్ గొప్ప నటుడు అని చెప్పడం మెగా అభిమానులకు కొంత నిరాశ కలిగించింది.;
మెగాస్టార్ చిరంజీవి- సీనియర్ నటి రాధిక కాంబోకు టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరూ కలిసి కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టే రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో తాజాగా రాధిక ఇచ్చిన ఒక ఆన్సర్ మెగా అభిమానుల్లో చర్చలకు దారితీసింది. అసలు విషయమేమిటంటే?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాధిక శరత్ కుమార్ ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో గ్లామర్, అభినయంతో మెప్పించిన ఆమె, సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అత్త పాత్రలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో మరో ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కూడా స్టార్ హీరోయిన్ గా రాణించారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.
ఇటీవల సుహాసిని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోకు రాధిక గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఇద్దరూ తమ కెరీర్, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ సరదాగా మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని.. రాధికకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. వరుస ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి రావడంతో రాధిక.. తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ క్రమంలో సుహాసిని.. చిరంజీవి- మోహన్ లాల్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్? అని అడిగారు. దీనికి రాధిక మోహన్ లాల్ పేరు చెప్పి, ఆయనను గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసించారు. వెంటనే మోహన్ లాల్ - కమల్ హాసన్? అని అడిగితే కమల్ హాసన్ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్ – శరత్ కుమార్? అన్న ప్రశ్నకూ కమల్ పేరే చెప్పారు.
ఆ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు చేసిన రాధిక, ఆయన కంటే మోహన్ లాల్ గొప్ప నటుడు అని చెప్పడం మెగా అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. కొందరు ఫ్యాన్స్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఇది కేవలం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మాత్రమేనని, ఎలాంటి వివాదం అవసరం లేదని అంటున్నారు.
ప్రతి నటుడికి తనదైన శైలి ఉంటుందని, రాధిక తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పిందని పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూని సరదాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కంప్లీట్ వీడియో చూస్తే.. ఓ క్వశ్చన్ లో శివరాజ్ కుమార్, చిరంజీవిలో ఎవరు బెస్ట్ అంటే చిరు అనే చెప్పారు రాధిక. కాబట్టి మెగాస్టార్ కన్నా మోహన్ లాల్ బెటర్ అని చెప్పడం తప్పేం కాదని, ఎవరు అభిప్రాయం వాళ్లదని అంతా చెబుతున్నారు. అయితే రాధిక, చిరంజీవి ఇద్దరూ దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ ఆర్టిస్టులే.