బన్నీ హెయిర్ స్టైల్.. ఆ డిస్కషన్ ఎందుకు?

అయితే ప్రజెంట్ లుక్ ఆయన కొత్త సినిమా కోసం ట్రై చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.;

Update: 2026-02-22 11:30 GMT

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే ఆయన ఈసారి మాత్రం అభిమానుల నుంచి మిక్స్‌ డ్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. సాధారణంగా బన్నీ ఏ మేకోవర్ చేసినా ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వస్తాయి. కానీ తాజాగా కనిపిస్తున్న హెయిర్ స్టైల్‌ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం గమనార్హం.

ఇటీవల పబ్లిక్ ఈవెంట్స్ సహా వివిధ ప్రదేశాల్లో అల్లు అర్జున్ లైట్ గోల్డెన్, బ్రౌన్ షేడ్స్ మిక్స్ చేసిన కొత్త హెయిర్ కలర్‌ తో కనిపిస్తున్నారు. ఆ స్టైల్ ఆయనకు కొంచెం కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో వెంటనే చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ స్పెషల్ అండ్ న్యూ స్టైల్ అంటూ మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆయనకు లుక్ అంతగా సూట్ కాలేదని కామెంట్లు చేస్తున్నారు.

అంతటితో ఆగకుండా.. బన్నీ హెయిర్ కలర్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కెరీర్ లో అల్లు అర్జున్ స్టైలింగ్‌ పై విమర్శలు రావడం చాలా అరుదు. ఇప్పటివరకు ఎప్పుడూ అలా జరగలేదు. ప్రతి మూవీ కోసం లుక్ ట్రై చేసి, కొత్త ట్రెండ్ తీసుకురావడం ఆయన ప్రత్యేకత. అందుకే ఈసారి వచ్చిన నెగటివ్ ఫీడ్‌ బ్యాక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

అయితే ప్రజెంట్ లుక్ ఆయన కొత్త సినిమా కోసం ట్రై చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బన్నీ.. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫస్ట్ లుక్, పోస్టర్ లేదా గ్లింప్స్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు క్లారిటీ లేదు.

అందుకే ఇప్పుడు బన్నీ మేకోవర్ కోసం జోరుగా చర్చ సాగుతోంది. మేకర్స్.. సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే రోల్ కు తగ్గట్టు హెయిర్ స్టైల్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో బన్నీ లుక్ కోసం ఫుల్ గా చర్చ సాగుతోంది. మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు కూడా డిస్కషన్ కొనసాగడం ఖాయమనే చెప్పాలేమో.

ఇక అట్లీతో బన్నీ చేస్తున్న సినిమా విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో యాక్షన్ అండ్ సైంటిఫిక్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది. సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలలుగా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కీలక సన్నివేశాలు ఇప్పటికే కంప్లీట్ చేశారని వినికిడి. ఇప్పుడు తన బ్రదర్ అల్లు శిరీష్ మ్యారేజ్ కోసం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బన్నీ హెయిర్ స్టైల్, కలర్ కోసం డిస్కషన్ నడుస్తూనే ఉంది.

Tags:    

Similar News