మరీ అంత వయొలెన్స్ అవసరమా?
ఇటీవలి కాలంలో దర్శకులు యూత్ ను టార్గెట్ చేస్తూ మరింత రా, రియలిస్టిక్ యాక్షన్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు.;
ఇండియన్ సినిమాల్లో కొంత కాలంగా వయొలెన్స్ సీన్స్ పెరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కన్నా వయొలెన్స్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్లు, ట్రైలర్లు చూస్తేనే సినిమాల టోన్ మొత్తం అర్థమవుతోంది. దీంతో సాధారణ ప్రేక్షకుల్లో మరీ ఇంత వయొలెన్స్ అవసరమా? అనే ప్రశ్న మెదులుతోంది.
తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న కల్ట్ టీజర్ విడుదలై పెద్ద చర్చకు దారి తీసింది. సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో వయొలెన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బాడీ పోర్ట్స్ తెగిపడే విజువల్స్, రక్తంతో నిండిన ఫ్రేములు కొంత మంది ప్రేక్షకులకు నచ్చినా.. మరికొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అలాంటి సీన్స్ అవసరమా అని కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ టీజర్ కూడా అదే తరహా చర్చకు కారణమైంది. డార్క్ మూడ్, మాస్ యాక్షన్, వయొలెన్స్ సీన్స్ ప్రధానంగా చూపించారు. కొన్ని షాట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అంటే అంత వయొలెన్స్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవలి కాలంలో దర్శకులు యూత్ ను టార్గెట్ చేస్తూ మరింత రా, రియలిస్టిక్ యాక్షన్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రియలిజం పేరుతో అతిగా హింస చూపిస్తే అది స్టోరీకి మేలు చేస్తుందా? లేక ప్రేక్షకులను దూరం చేస్తుందా? అన్న చర్చ మొదలైంది. కొందరికి ఇవి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే, మరికొందరికి మాత్రం అసహనం కలిగిస్తోంది. తెలుగు సహా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకప్పుడు స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ మెయిన్ గా ఉండేవి.
ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. టీజర్ నుంచే షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో వయొలెన్స్ సన్నివేశాలు హైలైట్ చేస్తున్నారు. దీంతో సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగినా, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమవుతోంది. సినిమా అంటే కేవలం వయొలెన్స్ కాదు. మంచి కథ, స్ట్రాంగ్ రోల్స్, ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. అవసరమైన చోట యాక్షన్ ఉండాలని అంటున్నారు.
కానీ మొత్తం సినిమా అవే ఉండకూడదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కొత్త జోనర్ సినిమాల పేరుతో హింసను పెంచడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. దర్శకులు, నిర్మాతలు కంటెంట్ తో పాటు ప్రేక్షకుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఆ ట్రెండ్ తగ్గుతుందా? లేక ఇంకా మరింత పెరుగుతుందా? అన్నది వేచి చూడాలి.