• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ డేట్లు...

రిలీజ్ డేట్లు క్లియరైపోయాయి..

By - Tupaki Desk
Update: 2016-07-16 17:30 GMT
నాలుగు రోజుల వ్యవధిలో రెండు భారీ సినిమాల రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఓ పక్క ‘కబాలి’ రిలీజ్ డేట్ ఖరారైపోయింది. మరో పక్క ‘జనతా గ్యారేజ్’ ఆగస్టు 12 నుంచి వాయిదా పడి సెప్టెంబరు 2కు వెళ్లిపోయింది. దీంతో ఈ రెండు సినిమాల విడుదల తేదీల్ని బట్టి తమ సినిమాల్ని షెడ్యూల్ చేసుకుందామని వేచి చూస్తున్న వేరే సినిమాల నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.

జులై 22న కబాలి రాకుంటే తమ సినిమాను విడుదల చేద్దామని చూసిన ‘జక్కన్న’ నిర్మాతలు.. కబాలి యధావిధిగా అదే రోజు వస్తుండటంతో తర్వాతి వారం.. అంటే జులై 29కి తమ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. ఇక అదే రోజు మరో చిన్న సినిమా కూడా రిలీజవుతోంది. అదే.. పెళ్లి చూపులు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాను సునీల్ సినిమాకు పోటీగా తెచ్చేస్తున్నారు.

మరోవైపు ‘బాబు బంగారం’ ఆగస్టు 12కు ఫిక్సవగా.. ఆ మరుసటి రోజు ‘తిక్క’ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 5 సంగతి తేలాల్సి ఉంది. ఆ రోజు ‘సాహసం శ్వాసగా సాగిపో’ను రిలీజ్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అది వచ్చినా రాకున్నా ‘చుట్టాలబ్బాయి’ని ఆ రోజు విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి సినిమా ‘మనమంతా’ను ఆగస్టు 19న రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అల్లు శిరీష్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ను సెప్టెంబరు 16న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.
Tags:    
  • Tollywood Movies 
  • Telugu nEWs 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS