దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలని

Update: 2015-05-23 09:30 GMT
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. కథానాయికలకు వయసులో ఉన్నప్పుడు అవకాశాలొచ్చేది. వయసు ముదిరితే అరకొర అవకాశాలైనా మునుముందు రావడం కష్టం. అందుకే ఇప్పట్నుంచే జాగ్రత్త పడిపోతున్నారు భామలంతా.

మిల్కీ తమన్నా ఇప్పటికే వైట్‌ అండ్‌ గోల్డ్‌ పేరుతో జువెలరీ చైన్‌ షోరూమ్‌లను ప్రారంభించింది. ఇలియానా సైతం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వస్త్ర దుకాణాలు తెరిచింది. అలాగే తాప్సీ ఇటీవలే వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థను పెద్ద ఎత్తున ప్లాన్‌ చేసింది. సోదరి, స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెడుతోంది. అలాగే కథానాయిక సంజన బెంగళూరు కేంద్రంగా యోగా సెంటర్‌ (అక్షర్‌ పవర్‌ యోగా అకాడెమీ)లు అభివృద్ధి చేస్తోంది. మరోవైపు కన్నడ సినిమాలు నిర్మించే పనిలో ఉంది. అలాగే పంజాబీ బొమ్మ ఛార్మి పూరి దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న 'జ్యోతిలక్ష్మి' చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించింది. మునుముందు సినిమాల్లో కోప్రొడ్యూసర్‌గా కొనసాగడానికి తనకంటూ ఓ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకుంది ఈ పంజాబీ బొమ్మ.

అయితే ఈ భామలందరికీ బాలీవుడ్‌ భామలే పెద్ద ఇన్‌స్పిరేషన్‌. ప్రీతిజింతా, జూహీచావ్లా, శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా.. ఇలా స్టార్లంతా దీపం ఉండగానే అన్నీ చక్కదిద్దుకుని ఇప్పుడు మల్టీ మిలియనీర్‌లుగా కొనసాగుతున్నారు.


Tags:    

Similar News