ఆ ఫన్నీ రీమేకును ఎవరు టేకప్ చేస్తారో?

Update: 2018-11-14 14:30 GMT
ఈమధ్య మనకు తెలుగులో రీమేక్ సినిమాల సంఖ్య కాస్త తగ్గిందిగానీ ఒక టైమ్ లో సగానికి సగం రీమేకులే. టాప్ లీగ్ స్టార్స్ దగ్గరనుండి మొదలు పెడితే చిన్న హీరోలవరకూ సేఫ్ గా రీమేకులపై ఆధారపడేవారు. ఇప్పుడు ట్రెండ్ మారి మన తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు ఇతర భాషలవారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలా అని మనం పూర్తిగా రీమేకులు మానలేదు లేండి.

తాజాగా హిందీలో డిఫరెంట్ కంటెంట్ తో కామెడీ సినిమాగా వచ్చి విజయం సాధించిన 'బధాయి హో' సినిమాను రీమేక్ చేసేందుకు ఒకరిద్దరూ తెలుగు రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారట.  హీరో ఒక అమాయితో లవ్ లో పడి పెళ్ళి చేసుకోబోయే సమయంలో హీరో అమ్మగారు యాభై ఏళ్ళ వయసులో గర్భం దాల్చడంతో హీరోకి పెద్ద ఇబ్బంది వస్తుంది.  తన లవర్ కి మా అమ్మ ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పుకోవాలి? ఈ వయసులో చిన్న తమ్ముడు వస్తాడంటే దాన్ని ఎలా స్వీకరించాలి.. సొసైటీని ఎలా ఎదుర్కోవాలి. ఇలాంటి తిప్పలతో సాగుతుంది సినిమా. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు.

పెద్ద స్టార్ హీరోలకు సెట్ కాదుగానీ మీడియం రేంజ్ హీరోలకు చక్కగా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్.  ఈ సినిమా కంటెంట్ బాగుంది గానీ ఈ సినిమాను తెలుగులో ఏ హీరో చేయడానికి ముందుకు వస్తాడో వేచి చూడాలి.  
    

Tags:    

Similar News