ఈ టైం లోనూ టాలీవుడ్ కాస్త లక్కీ
మహమ్మారి కారణంగా గత రెండు నెలలుగా ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు థియేటర్లు కూడా క్లోజ్ ఉండటంతో సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఖాళీగానే ఉన్నారు. ఈ సమయంలో టాలీవుడ్ ఒక విషయంలో లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో మూడు నెలల పాటు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే తెలుగులో సక్సెస్ లు వచ్చినన్ని మరే భాషల్లో కూడా రాలేదు. తొగులో సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో.. సరిలేరు నీకెవ్వరు చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన భీష్మ.. హిట్.. పలాస 1978 చిత్రాలు కూడా పర్వాలేదు అన్నట్లుగా నిలిచి కమర్షియల్ గా మెప్పించాయి.
తెలుగులో ఈ ఏడాది ఒక మోస్తరు హిట్స్ అయితే నమోదు అయ్యాయి. కాని తమిళం.. హిందీ.. ఇతర భాషల సినిమా పరిశ్రమల్లో పెద్దగా సక్సెస్ లే నమోదు కాలేదు. హిందీలో ఈ ఏడాది తనీషా ఒక మోస్తరుగా నడిచింది. పలు సినిమాలు విడుదల అయినా కూడా ఏ ఒక్కటి సక్సెస్ అయ్యింది లేదు. ఇక తమిళనాట పెద్ద సినిమాల హీరోలే ఈ ఏడాది రాలేదు. చిన్న చిత్రాలు వచ్చినా కూడా అవి సోది లోకి లేకుండా పోయాయి. మలయాళం కన్నడంలో కూడా ఇదే పరిస్థితి.
ఒక్క తెలుగులో మాత్రమే ఈ ఏడాది హిట్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో రాబోయే నెలల్లో కూడా అక్కడ భారీ చిత్రాలు వస్తాయనే నమ్మకం లేదు. పెద్ద చిత్రాలు ఈ ఏడాదిలో అసలు విడుదల అవుతాయో లేదో తెలియదు. కనుక ఈ ఏడాది మొత్తంలో తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్తు సమయంలో టాలీవుడ్ కొంతలో కొంత అయినా లక్కీ అంటూ ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటూ ఉంటారు.