• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైమ్ చూసి 'ఫ్యామిలీ...

టైమ్ చూసి 'ఫ్యామిలీ మ్యాన్' దిగుతున్నాడు

By - Tupaki Desk
Update: 2021-04-26 03:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. సక్సెస్ ఫుల్ వెబ్ సీరిస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' కు సిక్వెల్ గా వస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' లో కనిపించనుంది. అయితే రకరకాల కారణాలతో ఫ్యామిలీ మ్యాన్ 2 ఎప్పుడో ప్రసారం కావాల్సింది ఆగిపోయింది. ఫస్ట్ పార్ట్ చూసిన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఈ సెంకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సమంత పాత్ర ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది. కొద్ది నెలల క్రితం రిలీజైన టీజర్‌లో సమంత లుక్‌ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది. ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ ఒక ట్విటర్‌ ఎమోజీని విడుదల చేసింది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు సమంత కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ టైప్ ఎమోజీని అందుకున్న భారతీయ మహిళా నటుల్లో సమంతనే ప్రథమం.

అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.ఈ క్రమంలో మే రెండవ వారంలో ఈ సీరిస్ విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన అతి త్వరలో రానుంది. ఓ ప్రక్కన కరోనా తో జనం ఓటీటిలకు అతుక్కుపోయారు. ఈ టైమ్ ని రిలీజ్ కు ఫెరఫెక్ట్ టైమ్ గా భావిస్తున్నారు. సమంత కూడా ఉంది కాబట్టి తెలుగులో పెద్ద హిట్ అవుతుందని రాజ్‌ అండ్‌ డీకే భావిస్తున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌ ఆ మధ్యన విడుదల చేసిన ‘తాండవ్‌’ , ‘మీర్జాపూర్’ పై కొన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదురుకావడం వల్ల ఆలస్యంగా ఫ్యామిలీ మ్యాన్‌‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారని సమాచారం. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ మొదటి పార్ట్ దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. రెండో సీజన్‌లో సమంత టెర్రరిస్ట్‌గా నటిస్తుండడంతో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది.ఈ సీరిస్ లో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉండటంతో వాటిని రీషూట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యం అయ్యిందని చెప్తున్నారు.




Tags:    
  • Star Actors 
  • Family Man 2 
  • movie news 
  • Movie updates 
  • samantha 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS