ట్రెండీ టాక్‌: KGF-2 టీజర్ లో హైలైట్ అదేన‌ట‌

Update: 2021-01-05 08:41 GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `కేజీఎఫ్` కి పార్ట్ 2 గా తెర‌కెక్కుతున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర పనుల్లో బిజీగా ఉన్న టీమ్  ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ వేడి పెంచుతోంది. ఇప్ప‌టికే వ‌రుస పోస్ట‌ర్ల‌తో ట్రీట్ కొన‌సాగుతోంది. య‌ష్ పోస్ట‌ర్ తో పాటు అధీర పోస్ట‌ర్లు ఇప్ప‌టికే వైర‌ల్ గా దూసుకెళ్లాయి. య‌ష్ పుట్టిన‌రోజు కానుక‌గా జ‌న‌వ‌రి 8న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నామంటూ హైప్ క్రియేట్ చేశారు.

ఈ టీజ‌ర్ కోసం క‌న్న‌డ రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉత్కంఠ‌గానే ఉన్నారు. నిజానికి ఇంతకు మునుపు ఏ కన్నడ చిత్రం ఇంత హైప్ ను సృష్టించలేదనే చెప్పాలి. మొదటి భాగం ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై సంచ‌ల‌నాలు సృష్టించ‌డంతోనే చాప్ట‌ర్ 2పై ఇంత హైప్ నెలకొంది. పైగా చాప్ట‌ర్ 2లో బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్ సంజ‌య్ ద‌త్ `అధీర‌`గా విల‌న్ పాత్ర‌లో క‌నిపిస్తుండ‌డం మ‌రింత‌గా అంచ‌నాల్ని పెంచింది.

తాజాగా టీజ‌ర్ కి ముందే రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ రమికా సేన్ పోస్టర్ ను విడుదల చేయ‌గా.. ఆ రోల్ ఎంత‌ పవర్ ఫుల్ గా ఉండ‌నుందో రివీలైంది. ఫిలింవ‌ర్గాల‌ లీకుల ప్ర‌కారం.. టీజర్ ఆద్యంతం మాస్ ఎలివేషన్ షాట్స్ ‌తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. సంజయ్ దత్ అధీరా పాత్ర‌తో పోటీపడుతూ రాకీభాయ్ గా య‌ష్ న‌ట‌ ప్ర‌ద‌ర్శ‌న ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని టీజ‌ర్ లో ఇవ‌న్నీ హైలైట్ గా ఉండ‌నున్నాయ‌‌ని తెలిసింది. ఈ ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబ‌లే ఫిలింస్ నిర్మించింది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `కేజీఎఫ్` కి పార్ట్ 2 గా తెర‌కెక్కుతున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర పనుల్లో బిజీగా ఉన్న టీమ్  ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ వేడి పెంచుతోంది. ఇప్ప‌టికే వ‌రుస పోస్ట‌ర్ల‌తో ట్రీట్ కొన‌సాగుతోంది. య‌ష్ పోస్ట‌ర్ తో పాటు అధీర పోస్ట‌ర్లు ఇప్ప‌టికే వైర‌ల్ గా దూసుకెళ్లాయి. య‌ష్ పుట్టిన‌రోజు కానుక‌గా జ‌న‌వ‌రి 8న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నామంటూ హైప్ క్రియేట్ చేశారు.

ఈ టీజ‌ర్ కోసం క‌న్న‌డ రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉత్కంఠ‌గానే ఉన్నారు. నిజానికి ఇంతకు మునుపు ఏ కన్నడ చిత్రం ఇంత హైప్ ను సృష్టించలేదనే చెప్పాలి. మొదటి భాగం ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై సంచ‌ల‌నాలు సృష్టించ‌డంతోనే చాప్ట‌ర్ 2పై ఇంత హైప్ నెలకొంది. పైగా చాప్ట‌ర్ 2లో బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్ సంజ‌య్ ద‌త్ `అధీర‌`గా విల‌న్ పాత్ర‌లో క‌నిపిస్తుండ‌డం మ‌రింత‌గా అంచ‌నాల్ని పెంచింది.

తాజాగా టీజ‌ర్ కి ముందే రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ రమికా సేన్ పోస్టర్ ను విడుదల చేయ‌గా.. ఆ రోల్ ఎంత‌ పవర్ ఫుల్ గా ఉండ‌నుందో రివీలైంది. ఫిలింవ‌ర్గాల‌ లీకుల ప్ర‌కారం.. టీజర్ ఆద్యంతం మాస్ ఎలివేషన్ షాట్స్ ‌తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. సంజయ్ దత్ అధీరా పాత్ర‌తో పోటీపడుతూ రాకీభాయ్ గా య‌ష్ న‌ట‌ ప్ర‌ద‌ర్శ‌న ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని టీజ‌ర్ లో ఇవ‌న్నీ హైలైట్ గా ఉండ‌నున్నాయ‌‌ని తెలిసింది. ఈ ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబ‌లే ఫిలింస్ నిర్మించింది.
Tags:    

Similar News