ముగ్గురు రాజాల మాస్టర్ మ్యూజిక్

Update: 2018-01-27 04:21 GMT
సంగీత దిగ్గజం ఇళయరాజాకు పద్మవిభూషణ్ దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గత రెండు రోజులుగా బాషా భేదం లేకుండా అన్ని వర్గాల నుంచి ప్రశంశల జల్లులు కురుస్తూనే ఉంది. రాజా గారి వారసులు కూడా ఇదే రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. యువాన్ శంకర్ రాజా సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసుకోగా మరో అబ్బాయి కార్తీక్ రాజా కూడా సంగీత దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసాడు కాని అంత పేరు తెచ్చుకోలేకపోయాడు. ఇక కూతురు భవతారిణి సింగర్ గా - కంపోజర్ గా చెప్పుకోదగ్గ సినిమాలకు పని చేసారు. ఇప్పటి దాకా విడివిడిగానే స్వరకల్పన చేసిన ఈ కుటుంబం ఇప్పుడు ఒక సినిమా కోసం కలిసి పని చేయబోతోంది. అదే మామనిధన్. అంటే గొప్పవాడు అని అర్థం.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. శీను రామస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో విశేషం ఏంటంటే ఇళయరాజా మ్యూజిక్ ఇవ్వనుండగా యువాన్ శంకర్ రాజా - కార్తిక్ రాజా కూడా ట్యూన్స్ కంపోజ్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని యువాన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. భవతారణి ఒక పాట పాడే అవకాశం ఉంది. ఇలా కలయిక జరగడం మొదటిసారని, దీని పట్ల చాలా గర్వంగా ఉన్నానని యువాన్ చెబుతున్నాడు. దీనికి నిర్మాత కూడా అతనే. ప్యార్ ప్రేమ కాదల్ అనే సెట్స్ పై నున్న సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన యువాన్ కు మామనిధన్ రెండో సినిమా.

ఇళయరాజా వారి అబ్బాయిలతో కలిసి సంగీతం అందించబోతున్నారు అనే వార్త సంగీత ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది. పంజా - 7జి బృందావన్ - మన్మధా  లాంటి పలు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన యువన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. కార్తీక్ రాజా అజిత్ ఉల్లాసం లాంటి సినిమాల ద్వారా మనవాళ్ళకు తెలిసినవాడే. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేయబోయే మ్యూజికల్ ట్రీట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Tags:    

Similar News