ఇందుకే నయన్‌ లేడీ సూపర్‌ స్టార్‌

Update: 2021-06-19 17:30 GMT
కరోనా కారణంగా గత ఏడాది కాలంగా హీరోయిన్స్‌ ఒక్కటి రెండు ఆఫర్లు దక్కించుకోవడమే గగనం గా మారింది. అలాంటిది లేడీ సూపర్‌ నయన తార మాత్రం ఫుల్ బిజీగా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కరోనా సమయంలోనే ముక్కుత్తి అమ్మన్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నయన్‌ నటించిన మరో సినిమా నేత్రికన్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడంతో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు.

ఏ లేడీ ఓరియంటెడ్‌ మూవీకి కూడా రాని ఆఫర్‌ నేత్రికన్‌ కు వచ్చిందట. త్వరలోనే నేత్రికన్‌ ఓటీటీ రిలీజ్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నయనతార హీరోయిన్ గా రజినీకాంత్‌ అన్నాత్తే సినిమా కూడా పూర్తి అయ్యింది. ఈ రెండు కరోనా వల్ల ఆలస్యం అవుతున్నాయి. ఏ సమయంలో అయినా ఈ సినిమా లు విడుదల అయ్యే అవకాశం ఉంది. అన్నాత్తే సినిమా లో నయనతార లుక్‌ చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఆమె చేసిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేస్తుంది. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో సమంత మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలు అయ్యింది. ఈ ఏడాది చివరి వరకు సినిమా ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో కూడా ఈ ఏడాది మూడు సినిమా లను ఆమె విడుదలకు సిద్దం చేయడం.. అది కూడా మోస్ట్‌ క్రేజీ మూవీస్ అవ్వడం ఆమెకు మాత్రమే సాధ్యం అయ్యింది. వరుస సినిమాలతో రాబోతున్న నయన్‌ ను ఇందుకే లేడీ సూపర్‌ స్టార్‌ అంటామంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో అంటున్నారు.
Tags:    

Similar News