బాలీవుడ్ కు సినీ కార్మికుల ఉసురు తగిలిందా?

Update: 2020-05-01 02:30 GMT
ఇప్పటికే కరోనా క్రైసిస్ కారణంగా సినీ పరిశ్రమకు గడ్డుకాలం ఎదురైంది.  కొత్త సినిమా రిలీజులు లేవు.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.  ఇలాంటి పరిస్థితిలో బాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ నటులు తనువు చాలించడం చాలా బాధాకరం. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. నేడు రిషి కపూర్ కన్ను మూయడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ దీనికి ఒక కారణం ఉందని ఇతర సినీ ఇండస్ట్రీలలో ఉండే ప్రముఖులు అంటున్నారు. ఇది వినడానికి వింతగానే ఉంది కానీ వారు  చెప్పేదేంటంటే.. "బాలీవుడ్ కు సినీ కార్మికుల ఉసురు తగిలింది." నిజానికి బాలీవుడ్ లో కోట్లకు పడగలెత్తిన స్టార్లు చాలామందే ఉన్నప్పటికీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే కరోనా క్రైసిస్ సాయానికి ముందుకొచ్చారు. అలా ముందుకు వచ్చిన వారిని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు.  మిగతావారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు.  ఇండియా మొత్తానికి ఫ్రంట్ ఫేస్ గా ఉంటున్న బాలీవుడ్ ప్రముఖులు ఇలా సాయం చేయ్యకపోవడానికి ముందుకు రాకపోవడం పై ముంబైలో కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

'ఉసురు తగలడం' అనే కాన్సెప్ట్ ను ఎక్కువ సగం మంది నమ్మరు కానీ నమ్మే వారు మాత్రం ఇప్పటికైనా సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు బాలీవుడ్ ప్రముఖులు అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు.  సినీ కార్మికులను ఆదుకునే విషయం లో సౌత్ ఇండస్ట్రీల వారు చాలా ముందుగా స్పందించారని.. బాలీవుడ్ వారు కూడా అదే బాట పట్టాలని అంటున్నారు.
Tags:    

Similar News