నాపై మావారు ఎలాంటి ఆంక్షలు పెట్టరు: నటి ఇంద్రజ
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఇంద్రజ ఒకరు. నిజానికి ఇంద్రజ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గట్టిపోటీ ఉంది. అయినా ఆమె ఆ పోటీని తట్టుకుని నిలబడ్డారు. 'యమలీల' .. 'సొగసు చూడతరమా' .. 'అమ్మ దొంగా' వంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. వివాహమైన తరువాత సినిమాలకి దూరమైన ఆమె, ఆ తరువాత 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నుంచి ఆమె వరుసగా కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. " నేను తెలుగు బ్రాహ్మిణ్ .. మా వారు ముస్లిమ్. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మతం చూసి .. కులం చూసి .. ఒకరినొకరం ఇష్టపడం కదా. మా మనసులు కలిశాయి .. పెళ్లి చేసుకున్నాము. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా పరిచయం జరిగింది. అలా మేము ఆరేళ్లపాటు స్నేహితులుగానే ఉన్నాము. ఒకరిని ఒకరకం పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరింది .. ఆ తరువాతనే పెళ్లి చేసుకున్నాము.
మా వారు మంచి రైటర్ .. యాడ్ ఫిల్మ్ మేకర్ .. కొన్ని సీరియల్స్ లో నటించారు కూడా. అయితే మా మామగారివాళ్లకు గార్మెంట్స్ బిజినెస్ ఉంది. అది చూసుకుంటూనే, హాబీగా ఆయన మీడియాకి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటారు. నాకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, నేను ఈ పాత్ర చేయవచ్చునా? .. నాకు సెట్ అవుతుందా? అని అడిగితే ఆయన తన అభిప్రాయం చెబుతారు. అంతేగానీ ఇది చేయి .. అది చేయకు అనే ఆంక్షలు ఆయన ఎప్పుడూ పెట్టరు. నాకు సంబంధించిన పనుల్లో నా నిర్ణయాలకు ఆయన పూర్తి స్వేచ్ఛను ఇస్తారు" అని చెప్పుకొచ్చారు.