'జీన్స్ ఎందుకు? శివాజీ ధోతీ వేసుకోవాలిగా?' శివాజీ ‘సామాను’ వ్యాఖ్యలపై వివాదం
టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్ గా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్ గా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన వాడిన భాష, కొన్ని పదాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అయితే శివాజీ వ్యాఖ్యలపై ఇప్పుడు సింగర్ చిన్మయి రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఫైర్ అయ్యారు. హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన శివాజీ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. దరిద్రపు ***, సామాన్లు వంటి పదాలను ఉపయోగించడాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు నెట్టింట పోస్ట్ పెట్టారు చిన్మయి.
"తెలుగు నటుడు శివాజీ.. హీరోయిన్లను దరిద్రపు ము** వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు సామాన్లు (ఇన్సెల్స్ ఉపయోగించే పదం) కప్పుకోవడానికి చీరలు కట్టుకోవాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నారు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇన్సెల్ (స్త్రీ ద్వేషులు) అబ్బాయిలకు హీరోగా మారిపోయాడు" అంటూ చిన్మయి మండిపడ్డారు.
దరిద్రపు ము** వంటి బూతు పదాలను ప్రొఫెషనల్ వేదికలపై వాడటం ఏంటని ప్రశ్నించారు, భారతీయ సంప్రదాయం పాటించాలని చెప్పిన శివాజీ.. తాను మాత్రం జీన్స్, హూడీ ధరిస్తారని అన్నారు. ఆయన కేవలం ధోతీలు మాత్రమే కట్టుకోవాలి కదా? నుదుట బొట్టు పెట్టుకోవాలి కదా? పెళ్లి అయినట్లు ఓ గుర్తుగా కంకణాలతోపాటు మెట్టెలు ధరించాలి కదా? అంటూ చిన్మయి క్వశ్చన్ చేశారు.
ఏదేమైనా మహిళలను చూసే విధానం నమ్మశక్యం కానిదని ఆవేదన వ్యక్తం చేశారు. అస్సలు తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఇప్పుడు చిన్మయి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు, యూజర్లు.. చిన్మయికి మద్దతు తెలుపుతున్నారు. ఆమె పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఇంతకీ శివాజీ ఏమన్నారంటే?
అందం చీరలోనో, నిండుగా కప్పుకునే దుస్తుల్లోనో ఉంటుందని, సామాన్లు కనిపించేదాంట్లో కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా వేసుకున్నప్పుడు చాలా మంది అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు బయటికి నవ్వుతూ బాగున్నారు అంటారు కానీ, లోపల మాత్రం ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంది, దారిద్రపు ము**, మంచివి వేసుకుంటే ఇంకా బాగుంటుందని లోపల అనిపిస్తుందన్నారు.
"ఒక వేళ ఏమైనా అంటే స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లేదు అంటారు. స్త్రీ అంటేనే ప్రకృతి అందం. ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. స్త్రీ అంటే అమ్మ.. ఎప్పటికీ నా గుండెల్లో కనిపిస్తూనే ఉంటుంది. గ్లామర్ ఒక దశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది లక్. దాన్ని కోల్పోవద్దు" అంటూ శివాజీ మాట్లాడగా.. ఇప్పుడు అవేే చర్చనీయాంశంగా మారాయి.