• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వాళ్ళు నా పిల్లలు కాదు.....

'వాళ్ళు నా పిల్లలు కాదు.. నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి'

By - Tupaki Desk
Update: 2022-05-05 05:32 GMT
సినిమాలు లేకున్నా వార్తల్లో నిలిచే హీరోయిన్లలో ఉత్తరాది భామ పూనమ్ కౌర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అయింది. ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తుందో అర్థం కాకుండా.. వారి పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్లు పెడుతూ అందరూ తన గురించి చర్చించుకునేలా చేస్తుంది. ఆ విధంగానే ఇటీవల ఓ ఫొటో షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

కొద్ది రోజుల క్రితం పూనమ్ కౌర్ 'హ్యాపీ నెస్' అనే క్యాప్షన్ తో ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫోటో షేర్ చేయడం అనేక చర్చలకు దారి తీసింది. ఆ పిల్లలు ఎవరనేది అమ్మడు చెప్పకపోవడంతో దీనిపై నెటిజన్లు రకరకాల కథలు అల్లేసారు. పూనమ్ కు పెళ్లి ఎప్పుడైంది?, అప్పుడే ఇద్దరు పిల్లలున్నారా? అంటూ కామెంట్స్ చేశారు.

పూనమ్ పెళ్లి మరియు పిల్లల గురించి నెట్టింట చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ విషయం మీద తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. వాళ్ళు తన పిల్లలు కాదని స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలని.. తనని కాస్త బ్రతకనివ్వండంటూ ట్వీట్ పెట్టింది.

''ఇప్పటివరకూ నాకు జరిగిన డ్యామేజ్ చాలు. ఈ ఫోటోలో ఉన్నది నా స్నేహితుల పిల్లలు. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు సోషల్ మీడియాకి ధన్యవాదాలు. 'నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి' అంటూ దండం పెడుతున్న ఎమోజీతో రాసుకొచ్చింది పూనమ్.

ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఫోటో పోస్ట్ చేసినప్పుడే క్లారిటీగా చెప్పి ఉంటే.. దీని గురించి ఇంత చర్చ జరిగేది కాదు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి క్లారిటీలు ఇవ్వడం కాదు.. గతంలో పోస్ట్ చేసిన వైరాగ్యంతో కూడిన ట్వీట్లపై స్పష్టత ఇవ్వమని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక సినిమాల విషయనికొస్తే.. 'మాయాజాలం' సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది పూనమ్. ఆ తర్వాత 'ఒక విచిత్రం' 'సౌర్యం' 'వినాయకుడు' 'ఈనాడు' 'నాగవల్లి' 'గగనం' 'ఆడుమగాడ్రాబుజ్జి' 'పొగ' 'సూపర్ స్టార్ కిడ్నాప్' 'ఎటాక్' 'నెక్స్ట్ ఏంటి' వంటి పలు చిత్రాల్లో నటించింది.

తెలుగు తమిళ చిత్రాల్లో నటించినా పూనమ్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హీరోయిన్ నుంచి సెకండ్ హీరోయిన్‌ గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారినా.. సరైన ఆఫర్స్ దక్కలేదు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్.. ఇటీవల 'నాతి చరామి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ సినిమా కూడా అమ్మడిని నిరాశ పరిచిందనే చెప్పాలి.
Tags:    
  • Northindian 
  • starheroine 
  • PoonamKaur 
  • share 
  • twochildresn 
  • photosocialmedia 
  • viralnews 
  • tupakinews 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS