తీవ్ర నిరాశపరిచిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఇవే..!
కరోనా మహమ్మారి కారణంగా సినీ అభిమానులు వినోదానికి దూరం కావాల్సి వచ్చింది. గత కొన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో జనాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయించారు. ఇందులో వచ్చే వెబ్ సిరీస్ లను ఒరిజినల్ మూవీస్ ని చూడటం మొదలు పెట్టారు. థియేటర్స్ మూత పడడంతో మేకర్స్ షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వివిధ బాషల్లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలలో చాలా వరకు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన క్రేజీ మూవీస్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్' మొదటిది. టీజర్ ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ మరియు విమర్శకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఏ భాషలో కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక భారీ అంచనాలతో వచ్చి నిరాశ పరిచిన సినిమాలలో 'వి' కూడా ఉంది. నేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. నాని కెరీర్ లో 25వ చిత్రంగా రూపొందిన 'వి' పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబడిన ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే సినిమా డిజాస్టర్ అయ్యేదని కామెంట్స్ వచ్చాయి.
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీలో విడుదలయింది. 'బాహుబలి' 'భాగమతి' వంటి చిత్రాల తరువాత చాలా గ్యాప్ తీసుకుని నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో ఓటీటీ అంటే చిన్న సినిమాలకు ప్లాప్ సినిమాలకు అడ్డాగా మారుతోందని కామెంట్స్ వినిపించాయి. ఈ మూడు సినిమాలు కూడా అమెజాన్ లో రిలీజ్ అయిన సినిమాలు కావడం గమనార్హం. కాకపోతే ఈ సినిమాలు తీవ్ర నిరాశ పరిచినా ఓటీటీ రైట్స్ రూపంలో ప్రొడ్యూసర్స్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.