బూతు సినిమాలతో ఓ విప్ల‌వాత్మ‌క మార్పును నీరుగార్చారా...?

Update: 2020-09-18 23:30 GMT
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతపడటంతో ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ లాక్ డౌన్ లో ఓటీటీలు పుంజుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా డేస్ ని క్యాష్ చేసుకోడానికి సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఏటీటీలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడి సినిమాలు పే పర్ వ్యూ విధానంలో తమ యాప్ లో రిలీజ్ చేసి బాగానే క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ ఏటీటీకి ప్రారంభంలో మంచి ఆదరణ లభించినా ఇప్పుడు మాత్రం ఎవరూ ఈ యాప్ వైపు చూడటం లేదని తెలుస్తోంది.

కాగా 'ఏటీటీ' అనే ప‌ద్ధ‌తి చిన్న సినిమాల‌కి బాగా ఉప‌యోగప‌డుతుంద‌ని ప్ర‌చారం చేసిన సదరు యాప్ నిర్వాహకులు.. ఇప్పుడు 'ఏటీటీ' అంటే బూతు సినిమాలే అనేంత‌గా మార్చేశారని.. ఓ విప్ల‌వాత్మ‌క మార్పును నీరుగార్చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ యాప్ లో ప్రస్తుతం కేవలం అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల‌ని మాత్ర‌మే స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీటికైనా జ‌నాల నుంచి స్పంద‌న ఉందా అంటే అది కూడా లేదు. మార్పు తీసుకురావ‌డం మంచిదే కానీ.. ఆ మార్పు వ‌ల్ల ఉన్న మంచి పోకుండా అంద‌రకి క‌లిసొచ్చేలా ఉంటే బాగుంటుందని ఇండ‌స్ట్రీలో ఘాటైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సదరు ఈవెంట్ టీమ్ నిర్మించే సినిమాని వారి యాప్ లో రిలీజ్ చేయాలన్నా ముందు అడ‌ల్ట్ ఇమేజ్ ను తుడుచుకోవాల్సి ఉంది. మరి ఇప్పటికైనా మంచి కంటెంట్ ని అప్లోడ్ చేస్తారా లేదా నాసిరకం కంటెంట్ తోనే లాగిస్తారా అనేది చూడాలి.
Tags:    

Similar News