గిల్డ్ మీటింగ్ ..ఆడి వెళ్లిన సినిమాలతో థియేటర్లు స్టార్ట్..
మహమ్మారీ అల్లకల్లోలం నేపథ్యంలో ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా దుంపనాశనమైందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ రంగంలో ఉద్యోగులకు ఇబ్బందికర సన్నివేశం తెలెత్తింది. ఇకపోతే ఈనెలలో థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం మార్గదర్శకాల్ని వెలువరించింది. అక్టోబర్ 16 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని 50శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి.
ఆ క్రమంలోనే నిర్మాతలంతా ఎగ్జిబిటర్లతో మీటింగులు పెట్టుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపైనా చర్చిస్తున్నారు. తాజాగా నిర్మాతల గిల్డ్ కీలక సభ్యులు రెండు రోజుల పాటు మీటింగ్స్ పెట్టుకోబోతున్నారట. ఈ మీటింగ్స్ లో థియేటర్స్ టిక్కెట్ రేటు తగ్గించడంతో పాటు క్యూబ్ ఛార్జీలు లేకుండా సినిమాలు విడుదల చేసుకునే రీతిన కొన్నాళ్లూ పాటు రూల్స్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.
అలానే థియేటర్లు తెరిచిన వెంటనే ఏవి రిలీజ్ చేయాలి? అన్నది చర్చిస్తున్నారట. ఇంతకుముందు ఆడి వెళ్లిన వాటితోనే థియేటర్లు తొలుత ఓపెన్ చేస్తారట. అలవైకుంఠపురంలో - భీష్మ ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే కరోనా వచ్చింది. అందుకని వీటిని ఇంకా కొనసాగిస్తారు. బాహుబలి 2- రంగస్థలం- కేజీఎఫ్ సినిమాలతో అక్టోబర్ 16 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసే ఆలోచనలో వీరంతా ఉన్నట్లుగా తెలిసింది. దసరా మూడు రోజుల్లో పరిస్థితిని బట్టి.. ఎవైనా కొత్త సినిమాలు విడుదలైతే టిక్కెట్ ధర పెంచడానికి ప్లాన్ చేస్తున్నారట.