స‌హ‌జ న‌టి ఇంట్లో విల‌న్ పుట్టాడు!

Update: 2021-09-08 08:30 GMT
స‌హ‌జ న‌టి జ‌య‌సుధ న‌ట‌వార‌సుడు.. పెద్ద‌కుమారుడు శ్రేయాన్ష్‌ ఆరేళ్ల క్రితం `బ‌స్తీ` అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ  ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఆ త‌ర్వాత శ్రేయాన్ష్ క‌నిపించ‌లేదు.  తొలి ఫెయిల్యూర్ త‌ర్వాత శ్రేయాన్ష్ ప‌రిశ్ర‌మ‌కు దూరం అయ్యాడు. దీంతో అత‌ను సినిమాల‌పై అంత ఎఫెర్ట్ కూడా పెట్టిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. హీరోగా రాణించ‌డం క‌ష్ట‌మ‌ని త‌ప్పుకున్నాడా?  లేక సినిమాలంటే ఆస‌క్తి లేక ఎగ్జిట్ అయ్యాడా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే.. అటుపై  త‌ల్లిదండ్రుల వ్యాపార‌ల్లో బిజీ  అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌య‌సుధ చిన్న కుమారుడు నిహార్ క‌పూర్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు చిత్రంతో అత‌డు విల‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

మ‌రి అన్న‌య్య అనుభ‌వంతో ఇలా చేస్తున్నాడా?  లేక పెద్ద‌ల స‌ల‌హాల‌తో ముందుకు సాగుతున్నాడా? అన్న‌ది తెలియ‌దు గానీ నిహార్ మాత్రం అన్న‌య్య‌కు పూర్తి కాంట్రాస్ట్ గా ప్ర‌తి నాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మెడ‌లో సాలువా ధ‌రించి.. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని రౌద్రంతో కూడిన  నిహార్ లుక్ ని రిలీజ్ చేసారు. ల‌క్ష చ‌ద‌ల‌వాడ‌.. వేదిక ద‌త్ హీరో..హీరోయిన్లుగా `గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు` తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులోనే నిహార్ క‌ప‌ర్ విల‌న్ గా న‌టిస్తున్నాడు.  నేడు నిహార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేసారు.

నిహార్ మంచి హైట్.. వెయిట్ తో భీక‌రంగా ఉన్నాడు. విల‌న్ పాత్ర‌ల‌కు ప‌క్కాగా స‌రితూగుతాడ‌ని ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. నిహార్ ని విల‌న్ గానే ఎంట్రీ ఇస్తే బాగుంటుంద‌ని గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. వాట‌న్నింటిని బేరీజు వేసుకుని నిహార్ విల‌న్ గానే లాంచ్ అవుతున్నాడు. మ‌రి టాలీవుడ్ లో విల‌న్ గా ఎంత వ‌ర‌కూ రాణిస్తాడో చూడాలి.  టాలీవుడ్ లో విల‌న్ పాత్ర‌ల‌కు మంచి డిమాండ్ ఉంది.  ఇక్క‌డ స‌రైన లోక‌ల్ విల‌న్లు లేక‌పోడంతో బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో నిహార్  విల‌న్ గా స‌క్సెస్ అయితే గ‌నుక మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. జ‌య‌సుధ‌కు మెగా కాంపౌండ్ మంచు కాంపౌండ్ స‌హా అక్కినేని కాంపౌండ్ నంద‌మూరి కాంపౌండ్ తోనూ గొప్ప స‌త్సంబంధాలున్నాయి. నిహార్ కి అది క‌లిసొస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నీహార్ మ‌రో సోనూసూద్ లా ఎద‌గాల‌ని ఆకాంక్షిద్దాం.

జ‌య‌సుధ ప్ర‌స్థానం ఇదీ..

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ తెలుగు-త‌మిళం- హిందీ-మ‌ల‌యాళ‌ ప‌రిశ్ర‌మ‌ల‌కు సుప‌రిచితం. టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ద‌శాబ్ధాల పాటు కొన‌సాగిన‌ జ‌య‌సుధ(60) అటుపై రాజ‌కీయాల్లోనూ రాణించారు. హిందీ న‌టుడు జితేంద్ర క‌జిన్ నితిన్ క‌పూర్ ని 1985లో రెండో వివాహం ఆడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు ఇద్ద‌రు సంతానం. పెద్ద కుమారుడు నిహార్ బిజినెస్ మేన్. రెండో వాడు శ్రేయాన్ క‌పూర్ హీరో అయ్యారు. శ్రేయాన్ జాతీయ స్థాయి క్రీడ‌ల్లో షూట‌ర్ గానూ రాణించారు.

2020లో పెద్ద కొడుకు నిహ‌ర్ క‌పూర్ పెళ్లితో సెటిల‌య్యాడు. దిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని అతడు వివాహమాడారు. భ‌ర్త‌ నితిన్ క‌పూర్ మ‌ర‌ణానంత‌రం జ‌య‌సుధ పూర్తిగా సామాజిక కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్ర‌జా సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం రాజ‌కీయంగా త‌న‌కు ప్ల‌స్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో సికింద‌రాబాద్ ఎమ్మెల్యేగా కొన‌సాగిన జ‌య‌సుధ కొన్నాళ్ల పాటు రాజ‌కీయాల‌కు బ్రేక్ ఇచ్చి సామాజిక కార్య‌క్ర‌మాల‌కే అంకిత‌మ‌య్యారు. ఇటీవ‌లే పార్టీ మారిన సంగ‌తి తెలిసిందే. గ‌త‌ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ కి ముందు వైయ‌స్సార్ సీపీ పార్టీ ఏపీ వింగ్ లో చేరారు. మ‌హిళా నాయ‌కురాలిగా ఎంతో ప‌రిణ‌తితో సేవ‌లందించారు. ప‌రిశ్ర‌మ‌లో టీఎస్సార్- చిరంజీవి- మోహ‌న్ బాబు- బాల‌కృష్ణ ఇలా ఎంద‌రో స్నేహితులు ఉన్నారు. సౌత్ - నార్త్ నుంచి సినీరాజ‌కీయ వ‌ర్గాల్లో స్నేహితులు ఉన్నారు.

జ‌య‌సుధ న‌టన నుంచి త‌ప్పుకున్నారా?

త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ‌తో దశాబ్ధాల పాటు ఏలిన స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ఇటీవ‌ల ఎందుక‌నో స్థ‌బ్ధుగా ఉన్నారు. ఎయిటీస్ స్టార్ల పార్టీలో త‌ప్ప పెద్ద‌గా యాక్టివ్ గా క‌నిపించ‌డం లేదు. అయితే న‌ట‌న నుంచి విర‌మించారా? అంటే.. అలాంటిదేమీ లేదు. జీ 5 తమిళ వెబ్ సిరీస్ `కరోలిన్ కామాక్షి`తో సీనియ‌ర్ న‌టి మీనా తన డిజిటల్ అరంగేట్రం చేసారు. వేరొక వెబ్ సిరీస్ లో మీనాతో పాటు జ‌య‌సుధ న‌టించ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది.
Tags:    

Similar News