ఏ హీరో గొప్ప ఆటగాడు కాబోతున్నాడు?
టాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదు. ఒకవేళ తెరకెక్కినా? అవి కమర్శియల్ యాస్పెక్ట్ లోనూ రూపుదిద్దుకుంటాయి.;
టాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదు. ఒకవేళ తెరకెక్కినా? అవి కమర్శియల్ యాస్పెక్ట్ లోనూ రూపుదిద్దుకుంటాయి. క్రీడా నేపథ్యాన్ని సైతం పక్కాగా కమర్శియలైజ్ చేయగల మేధావులు మాత్రం టాలీవుడ్ లోనే ఉన్నారు. స్టార్ హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సూర్య, విజయ్ దేవరకొండ అందరూ క్రీడ నేపథ్యంలో సాగే కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు? గొప్ప ఆటగాడుగా బాక్సాఫీస్ వద్ద సెంచరీలు నమోదు చేస్తారు? ఎవరి నటన సాధారణ ప్రేక్షకులు సహా క్రీడా ప్రేమికులను మెప్పిస్తుంది? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న `పెద్ది` సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఒక పవర్‌ఫుల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. చరణ్ తన పాత్ర కోసం ఫిజికల్‌గా ఎంతో మేకో వర్ అయ్యాడు.
కుస్తీ, క్రికెట్, కబడ్డీ నేపథ్యంలో సాగే కథ కావడంతో? ఆ మూడు క్రీడలకు సంబంధించిన పాత్రల్లో చరణ్ కనిపించ నున్నాడు.`పెద్ది`తో ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ జర్నీని చూపించబోతున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే `గని` లో బాక్సర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ `కొరియన్ కనకరాజు` అనే మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కొరియాలో జరుగుతోంది.
ఈ సినిమా అనంతరం నటించబోయే రెండు సినిమాలు క్రీడా నేపథ్యంలోనే ఉంటాయి. వాటిలో ఓ చిత్రంలో వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిం చనున్నాడు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య వెంకీ అట్లూరీ దర్శకత్వంలో `విశ్వనాధ్ అండ్ సన్స్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పిస్టల్ షూటింగ్ క్రీడతో ముడి పడిన చిత్రమిది. ఇందులో పిస్టల్ షూటర్ పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విక్రమ్. కె. కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇదొక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్స్ట్ డ్రామా. ఇందులో విజయ్ హార్స్ రైడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి స్వారీ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఇలా నలుగురు హీరోలు తమ సినిమాలతో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు సిద్దమవు తున్నారు. రామ్ చరణ్ ఎమోషన్, వరుణ్ తేజ్ ఫిజిక్, సూర్య డెడికేషన్, విజయ్ దేవరకొండ ఎనర్జీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీరిలో ఎవరు గొప్ప ఆటగాడిగా నిలుస్తారనేది సినిమా కథనం, వారి నటనపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా? వెండి తెరపై ఈ ఆటగాళ్ల పోటీ ప్రేక్షకులకు మాత్రం కనువిందు చేయడం ఖాయం.