• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ స్టార్ త‌మ్ముడికి...

రౌడీ స్టార్ త‌మ్ముడికి న‌టులు కావ‌లెను

By - Tupaki Desk
Update: 2022-02-17 12:30 GMT
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ఇప్ప‌డిప్పుడే నిల‌దొక్కుకుంటున్నాడు. `దొర‌సాని` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అత‌నికి స‌క్సెస్ ని మాత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` అందించింది. `పుష్ప‌క విమానం`తో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెట్టించిన ఉత్సాహంతో వ‌రుస‌గా మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. తాజాగా మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

`గం. గం.. గ‌ణేశా` అనే విభిన్న‌మైన టైటిల్ తో రూపొంద‌నున్న ఈమూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి రానుంది.  ఉద‌య్ శెట్టి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. హై లైఫ్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై కేదార్ సెల‌గంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న మూవీ కోసం ప్ర‌తిభావంతులైన కొత్త న‌టీన‌టుల‌కు ఆహ్వానం ప‌లుకుతూ చిత్ర బృందం ఆడిష‌న్స్ ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్టుగా గురువారం ఓ ప్ర‌క‌టన‌ని విడుద‌ల చేసింది.

25 నుంచి 55 ఏళ్ల వ‌ర‌కు వివిధ పాత్ర‌ల కోసం న‌టులు, 18 - 20 ఏళ్ల ఓ పాత్ర‌కు సంబంధించిన న‌టికి ఆడ‌ష‌న్ ని నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తి వున్న వారు Audition.gamgamganesha@gmail.com కు  త‌మ ఫొటోలు, సంబంధిత వివ‌రాల్ని పంపించుకోవ‌చ్చు. అయితే ఫిల్ట‌ర్ ఫొటోస్‌.. టాక్ టాక్ వీడియోస్ పంప‌వ‌ద్ద‌ని, ఫోన్ కాల్స్ చేయ‌రాద‌ని టీమ్ ఈ సంద‌ర్భంగా తెలిపింది.

ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న `గం.గం.. గ‌ణేశా` చిత్రాన్ని ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం కొత్త న‌టీన‌టుల‌ని ఎంపిక చేయ‌డం కోసం కాస్టింగ్ కాల్ ని నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ మూవీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నుంది.
Tags:    
  • gamgamganesha 
  • ananddevarukonda 
  • newmovie 
  • wanted 
  • actores 
  • tollywood 
  • movienews 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS