ఫేడ‌వుట్ హీరోయిన్ కి స్టార్ డైరెక్ట‌ర్ కి ఏంట‌ట‌?

Update: 2021-06-14 02:30 GMT
క‌థానాయిక ఎంపిక అంటే ఛాయిస్ ఎవ‌రికి ఉంటుంది? మొద‌ట డైరెక్ట‌ర్ ఓకే చెప్పాలి. ఫ‌లానా హీరోయిన్ అని చాలా వ‌ర‌కూ డైరెక్ట‌ర్ లే రిఫ‌ర్ చేస్తారు. ఆ త‌ర్వాత హీరోకి ఆప్ష‌న్ ఉంటే ఫ‌లానా అని చెబుతాడు. ఇక‌పోతే నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ ఆ త‌ర్వాతే ఉంటుంది. నేటి రోజుల్లో నిర్మాత ఫైనాన్షియ‌ర్ గా స్థిర‌ప‌డిపోయారు కాబ‌ట్టి క‌థానాయిక‌ల విష‌యంలో వేలు పెట్ట‌డం క‌ష్టం.

అయితే అత‌నో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్.. వ‌రుస ఫ్లాపులతో దెబ్బ‌ తిన్న స్టార్ డైరెక్ట‌ర్ .. అప్ప‌ట్లో ఒక స్టార్ హీరోకి ఓ పెద్ద‌ ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు.. ఆ త‌రువాత అదే స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కుర్ర హీరోల‌తో సినిమాలు తీసి బాగానే పేరు సంపాదించాడు. అయితే ఆ డైరెక్ట‌ర్ కి హీరోయిన్ ఎంపిక అంటే చాలా మ‌క్కువ‌ ఎక్క‌వనే కామెంట్స్ ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంటాయి.

ఇప్పుడు త‌న‌కు పేరు తెచ్చిన అదే స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా ఓ ఫేడ్ అవుట్ కి ద‌గ్గ‌ర‌యే హీరోయిన్ ని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌! అంటూ వార్నింగులు విన‌వ‌స్తున్నాయి. ఏం తేడాలొచ్చినా ఆ హీరో వ‌దిలేస్తారేమో కానీ అభిమానులు వ‌దిలేయ‌రు! అంటూ సింప్ట‌మ్స్ బ‌య‌ట‌ప‌డుతున్నాయిట‌. మ‌రి ఆ స్టార్ డైరెక్ట‌ర్ మ‌న‌సు మార్చుకుని హీరోయిన్ ఎంపిక బాధ్య‌త‌ను హీరోకే అప్ప‌జెబుతారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News